జగపతి బాబు (Jagapati Babu) ముక్కుసూటి మనిషి. తన మనసులోని మాటలను, తానూ చెప్పాలనుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా చెప్పడం ఆయన నైజం. అలాగే, ఫాల్స్ ప్రెస్టీజ్ వంటి అంశాలకు ఆయన వెళ్ళరు. రామ్ చరణ్ 'పెద్ది' విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, విలన్ - క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫేజ్ గురించి మొహమాటం లేకుండా చెప్పేశారు.

Continues below advertisement

ఇప్పుడు సుఖంగా ఉంది - జగపతిబాబు!'హీరోగా, రొమాంటిక్ హీరోగా, ఇప్పుడు విలన్ - క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా... మీ కెరీర్‌లోని ఏ దశలో మీరు ఎక్కువ సంతోషంగా ఉన్నారు?' అని ప్రశ్నించగా... ''ఇప్పుడు ఉన్న దశే నాకు చాలా సుఖంగా ఉంది'' అని సమాధానం ఇచ్చారు. ఇంకా జగపతి బాబు మాట్లాడుతూ... ''ఇప్పుడు ఎందుకు సుఖంగా ఉందంటే? ఇప్పుడు నా నెత్తి మీద ఎటువంటి బాధ్యత కానీ, భారం కానీ లేదు. హీరోగా ఉన్నప్పుడు... ప్రింట్లు వెళ్లడం, చెక్కుల మీద సంతకాలు, థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ బ్యానర్లు కట్టారా? లేదా? అని బోలెడు టెన్షన్లు ఉండేవి. అప్పట్లో నిర్మాతలు డబ్బులు కట్టకపోతే చెక్కుల మీద నేను సంతకాలు పెడుతూ ష్యూరిటీ ఇచ్చేవాడిని. ఇప్పుడు అటువంటి టెన్షన్లు లేవు. నేను సెట్‌కు వెళ్లి నటించడం, వెళ్ళిపోవడం... అది మాత్రమే నా పని'' అని చెప్పారు. చిక్కులు లేకుండా సంతోషంగా బ్రతకడం తన పాలసీ అని ఆయన వివరించారు.

Also ReadPawan Kalyan Producers Meeting - పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?

Continues below advertisement

'పెద్ది'కి అప్పలసూరి ఎమోషనల్ పిల్లర్!Jagapathi Babu Opens Up On His Role In Peddi Movie: 'పెద్ది' సినిమాలో తన పాత్ర అప్పల సూరి గురించి జగపతి బాబు మాట్లాడుతూ... ''ఈ 'పెద్ది' సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అవుతుందని నేను నమ్ముతున్నా. ఇందులో నా పాత్ర సినిమాకు ఎమోషనల్ పిల్లర్ లాంటిది. ఇది నెగిటివ్ పాత్ర కాదు... ఈ పాత్ర కోసం నటనలో కంటే నేను పడ్డ కష్టం అంతా డబ్బింగ్‌లో ఉంది. ఆ ఉత్తరాంధ్ర యాస, పాత్రలోని ఎమోషన్ రావడం కోసం రోజుకు కేవలం రెండు మూడు డైలాగులు మాత్రమే చెప్పేవాడిని. ఆ క్రమంలో కొన్నిసార్లు నా నరాలు కూడా బిగుసుకుపోయాయి'' అని చెప్పారు.

Also Read: Madhura Sreedhar Reddy - సమస్యల పేరుతో పరువు తీయకండి... సినిమా వర్కవుట్ కాకపోతే వెళ్ళిపోండి - మధుర శ్రీధర్ రెడ్డి

'కష్టాల్లో ఉన్నవారికి లేదా యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి?' అని జగపతి బాబును అడిగితే... ''నేను ఎవరికీ సలహాలు ఇవ్వను. కానీ నా లైఫ్ మంత్ర మాత్రం ఒక్కటే... లెట్ ఇట్ గో (వదిలేయ్) అండ్ సో వాట్ (అయితే ఏంటి). ఏది జరిగినా మన మంచికే అనుకుని ప్రవాహంతో పాటు సాగిపోవాలి. జీవితాన్ని సింపుల్‌గా ఉంచుకుంటే అన్నీ సింపుల్‌గా అవుతాయి'' అని అన్నారు. తాను డెస్టినీ (విధి)ని. జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతానని జగపతి బాబు చెప్పారు. వైదీశ్వరన్ కోయిల్ ( తమిళనాడులోని ఆలయం)లో తన నాడి చూసి తన జీవితంలో జరిగే విషయాలన్నీ ముందే చెప్పారని, అవి అలాగే జరుగుతున్నాయి కూడా జగపతి బాబు తెలిపారు.

Also ReadMahesh Babu Next Movie After Varanasi - 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?