Jacqueline Fernandez: జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఫిక్స్డ్ డిపాజిట్లు 7.27 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ

జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సుఖేష్ చంద్రశేఖర్ కేసులో ఆమెకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసుకుంది.

Continues below advertisement

జాక్వలిన్ ఫెర్నాండేజ్ పేరు చెబితే మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ విన్నర్ అని గుర్తు వచ్చేది. ఆమె సినిమాల్లోకి రాక ముందు! మోడలింగ్, సినిమాల్లో యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత గ్లామర్ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్నారు. స్టైలిష్ ఫోటోషూట్స్, సినిమా కబుర్లతో వార్తల్లో నిలిచారు. అయితే, కొన్ని రోజుల క్రితం ఆమె కేసులో చిక్కుకున్నారు.

Continues below advertisement

ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ను అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అతడి నుంచి ఆమె ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సుఖేష్‌తో జాక్వలిన్ సన్నిహితంగా దిగిన ఫొటోలు బయటకు రావడం కూడా కలకలం సృష్టించింది. ఇదంతా గతం. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే...

జాక్వలిన్ ఫెర్నాండేజ్‌కు సంబంధించిన రూ. 7.27 కోట్లను ఈడీ అధికారులు అటాచ్ చేసుకున్నారట. వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఆమె ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో సేవ్ చేసుకున్న మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారని సమాచారం అందుతోంది.

Also Read: చిరంజీవి, రామ్ చరణ్ 'ఆచార్య' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

సుఖేష్ చంద్రశేఖర్ కేసు కారణంగా పబ్లిక్‌లో రావడనికి ఒకటికి రెండుసార్లు జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఆలోచిస్తున్నారు. జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమా 'ఎటాక్'. అందులో జాక్వలిన్ కూడా ఒక రోల్ చేశారు. ఆ సినిమా విడుదల సమయంలో సెలెక్టివ్ గా మీడియా ముందుకు వచ్చారు.

Also Read: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!

Continues below advertisement