Siddhu Jonnalagadda's Jack Review In Telugu: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన 'జాక్' సినిమా ప్రీమియర్ షోలు పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు ఓవర్సీస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న హీరో జోరుకు ఈ సినిమా బ్రేకులు వేసిందని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటే అర్థం అవుతోంది.
స్పై యాక్షన్ కామెడీ...డిజప్పాయింట్ చేసింది!స్పై యాక్షన్ కామెడీగా రూపొందిన 'జాక్' సినిమా డిజప్పాయింట్ చేసిందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. సినిమా చాలా బోరింగ్ అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ఈ సినిమాకు 2/5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. మెజారిటీ జనాలు అదే రేటింగ్ ఇస్తున్నారు. కొందరు 2.25/5 రేటింగ్ ఇస్తున్నారు.
భాస్కర్ గారు... ఏంటిది?'వాళ్లు రా ఏజెంట్స్ అనుకున్నారా లేక టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ అనుకున్నారా?' అంటూ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarollu Bhaskar)ని ప్రశ్నించాడు ఒక నెటిజన్. సినిమాలో దర్శకత్వం మీద చాలా మంది సెటైర్లు వేస్తున్నారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, దేశభక్తి, మదర్ సెంటిమెంట్ - ఇంటర్వెల్ అయ్యే సరికి చాలా ఎమోషన్స్ దర్శకుడు టచ్ చేసినప్పటికీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదని మరొక నెటిజన్ పేర్కొన్నాడు. సెకండ్ ఆఫ్ చూస్తే ఇల్లాజికల్ అనిపించిందని మరొకరు పేర్కొన్నారు.
'రా'ని రోత చేస్తే ఎలా?'జాక్' కథ మీద సరిగా వర్కౌట్ చేయలేదని విమర్శ ఎక్కువ మంది నుంచి వినపడుతోంది. 'రా ఏజెంట్స్ అంటే రాయల్ కింద చూపించాలి ఇలా రోత కాదు' అంటూ ఒక నెటిజన్ పేర్కొన్నాడు. ప్రతిసారి వన్ లైనర్స్, పంచ్ డైలాగులతో సినిమా వర్కౌట్ అవ్వదని, ఇక ఎప్పటికీ అర్థం అవుతుందోనని హీరో సిద్దు జొన్నలగడ్డ మీద సెటైర్ వేశాడు. ఎంత చెప్పినా థియేటర్లలో చూస్తా అంటే వెళ్లి మాలాగా బలవమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
సినిమాలో అటు కామెడీ వర్కౌట్ కాలేదని, అదే సమయంలో స్పై సీన్లు కూడా సరిగా కుదరలేదని మరొక నెటిజన్ తెలిపాడు. ఈ కథలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కమర్షియల్ అంశాలు అన్ని ట్రై చేశాడని, అయితే ఒక్కటి కూడా వర్క్ అవుట్ కాలేదని, స్క్రీన్ ప్లే క్లంజిగా ఉందని తెలిపాడు. హీరో సిద్ధూ జొన్నలగడ్డ తన భుజాల మీద సినిమాను మోయాలని ప్రయత్నించినప్పటికీ డైలాగులు గానీ రైటింగ్ గానీ సపోర్ట్ చేయలేదని టాక్. స్పై పోర్షన్ అయితే ఇరిటేట్ చేస్తుందట. మ్యూజిక్ అసలు బాలేదట. థియేటర్లలో కూర్చోవడం కష్టమే అంటున్నారు.