టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ధన్ రాజ్ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘జబర్దస్త్’ షోలో ధనాధన్ ధన్ రాజ్ గా తనదైన కామెడీతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. చాలాకాలంగా అగ్ర కమెడియన్ గా ఉన్న ధన్ రాజ్ ఆ తర్వాత ఆ షో నుంచి బయటికి వచ్చేసాడు. ‘జబర్దస్త్’ లో ఉన్న సమయంలోనే ధనరాజ్ కి సినిమాల్లో అవకాశాలు పెరిగిపోయాయి. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అనంతరం ‘బిగ్ బాస్’ సీజన్-1 లో పాల్గొని దాదాపు 40 రోజులపాటు హౌజ్ లో ఉండి టాప్ టెన్ ప్లేస్ లో చోటు సంపాదించాడు.


ఆ తర్వాత బుల్లితెరపై అదిరింది షోలో కనిపించాడు. హీరోగా, నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. కానీ అవేవీ ధన్ రాజ్ కి గుర్తింపును తేలేకపోయాయి. ఇక రీసెంట్ మళ్లీ మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బిజీ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధన్ రాజ్ తను ‘బిగ్ బాస్’ షో లో వెళ్లడం గురించి తనకిచ్చిన రెమ్యునరేషన్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘బిగ్ బాస్’ లోకి వెళ్లడానికి రీజన్ ఏంటని? యాంకర్ అడగగా దానికి ధనరాజ్ బదులిస్తూ..


"నేను టీవీ షోస్ చేస్తున్న సమయంలోనే ‘బిగ్ బాస్’ గురించి తెలిసింది. కానీ, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ తర్వాత ఈ షోకి ఎన్టీఆర్ గారు హోస్ట్ చేస్తున్నారు అని తెలియగానే నేను కూడా ‘బిగ్ బాస్’కి ఓకే చెప్పాను. ఆ తర్వాత నవదీప్ కూడా ‘బిగ్ బాస్’కి వెళ్తున్నారనే విషయం తెలిసింది. ‘జై’ మూవీ నుంచి మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పుడు మనం ‘బిగ్ బాస్’కి వెళ్లాక ఉండకపోతే ఏంటి? అని నవదీప్‌ను అడిగితే, ‘బిగ్ బాస్’లో నేను ఉండను, వెళ్ళిపోతా అని చెప్తే పంపించేస్తారు అని అన్నాడు. నవదీప్ నాతో పాటే హౌస్‌కి వస్తాడనుకున్నా. కానీ వైల్డ్ కార్డులో వస్తాడని నాకు తెలియదు" అని అన్నాడు.


ఇక హౌస్ లో నాకు ముమైత్ ఖాన్ తో మంచి రిలేషన్ ఏర్పడింది. మా మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ షిప్ ఉంది. ఆమె సడన్ గా బయటికి వెళ్లిపోవడంతో నేను ఏడ్చేశాను. ఆ సంఘటన తర్వాత నేను కొంత లోగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక వీడియో చూపిస్తే అసలు ప్రెగ్నెంట్ అయిన మా మిస్సెస్ ని వదిలిపెట్టి రావడం ఏంటి? ఎంత పిచ్చోన్ని నేను? డబ్బు ఇస్తే వెళ్ళిపోతామా? అని బాగా ఫీలయ్యాను. దాంతో నేను వెళ్తానని ‘బిగ్ బాస్’ కు చెప్పినా నన్ను పంపలేదు. ఆ తర్వాత నా ఎలిమినేషన్ రోజు మా అబ్బాయి పుట్టాడు. ఆ విషయాన్ని తారక్ స్టేజిపై చెప్పడం ఎంతో ఆనందం అనిపించింది. ‘బిగ్ బాస్’లో మా సీజన్ అలా గుర్తుండిపోవడానికి అది కూడా ఓ కారణం" అని పేర్కొన్నాడు.


మీరు ‘బిగ్ బాస్’కి వెళ్ళినప్పుడు ఎంత ఆఫర్ ఇచ్చారు? అని యాంకర్ అడగగా.. "నేను ఒక వారానికి 7 లక్షల 50వేలు తీసుకున్నాను. బేసిగ్గా దీని గురించి చాలా మంది చెప్పరు. కానీ నేను తీసుకున్నాను కాబట్టి ఆ విషయం చెప్పడంలో తప్పులేదు. రెమ్యునరేషన్ కూడా ఫర్ డే కాకుండా వీక్లీ వైజ్ గా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఏ వీక్ వచ్చేస్తామో తెలియదు కదా. అందుకే వీక్లీ రెమ్యునరేషన్ లాగా ఇస్తారు" అని చెప్పుకొచ్చాడు ధన్ రాజ్.


Also Read : కమెడియన్​తో జతకట్టనున్న ‘చంద్రముఖి 2‘ బ్యూటీ, త్వరలో అధికారిక ప్రకటన!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial