తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలైన కలైపులి ఎస్. థాను (Kalaipuli S Thanu), కెఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja), ఎస్ఆర్ ప్రభు (SR Prabhu) ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) కన్ను పడింది. ఈ రోజు ఉదయం నుంచి వాళ్ళ ఇళ్ళలో, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 


కలైపులి ఎస్. థాను ఇంటిలో...
తమిళ పరిశ్రమలోని అగ్ర నిర్మాతల్లో కలైపులి ఎస్. థాను ఒకరు. ఆయన ఆఫీసుకు ఈ రోజు ఐటీ అధికారులు చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆయన కంటే ముందు ప్రముఖ ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బు చెళియన్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు.


సూర్య, కార్తీ కజిన్స్ ఇళ్ళలోనూ...
తమిళ పరిశ్రమలో మరో ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, కేఈ జ్ఞానవేల్ రాజా ఇళ్ళల్లోనూ సోదాలు జరిగాయి. వాళ్ళిద్దరూ సూర్య, కార్తీ కజిన్స్ కావడం విశేషం. సూర్య, కార్తీ హీరోలుగా ఈ నిర్మాతలు చాలా సినిమాలు నిర్మించారు. 'సింగం' సిరీస్ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తే... 'ఖైదీ', 'కాష్మోరా' సినిమాలను ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. వీళ్ళపై ఐటీ రైడ్స్ సూర్య, కార్తీపై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? అనే డిస్కషన్ జరుగుతోంది.


Also Read : స్టార్స్ సెక్స్ లైఫ్ గురించి అడిగితే మీ అమ్మ ఏమీ అనుకోరా? - కరణ్ జోహార్‌ను ఆటాడుకున్న ఆమిర్ ఖాన్


కోలీవుడ్‌లో ఏం జరుగుతోంది?
ఉదయం నుంచి అగ్ర నిర్మాతలపై జరుగుతున్న ఐటీ రైడ్స్ చెన్నైలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. తమిళ చలన చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోందని అందరూ చర్చించుకుంటున్నారు.టాక్స్ సరిగా కట్టలేదని నిర్మాతలపై ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు సమాచారం. 



Also Read : సిగ్గు లేకుండా వెళ్ళి తులసిని బతిమలాడుకోమంటున్న లాస్య- శ్రుతి కోసం కౌసల్యకి ఫోన్ చేసిన తులసికి ప్రేమ్ విషయం తెలిసిపోతుందా?