Kalki 2898 AD: ‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా దీపికా పదుకోణ్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో దేశవ్యప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. భారతీయ పురాణాల స్పూర్తితో సరికొత్త సైన్స్ ఫిక్షన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. గ్లింప్స్ తర్వాత మూవీను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న అభిమానులకు చేదే వార్త చెప్పారట మూవీ మేకర్స్. మూవీను అనుకున్న సమయం కంటే ఇంకా ఆలస్యంగానే రిలీజ్ చేస్తారనే టాక్ రావడంతో ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట అభిమానులు. 


జనవరి నుంచి మే నెలకు ‘కల్కి 2898 ఏడీ’
 
‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ వీడియోను విడుదల చేసిన దగ్గరనుంచీ ఈ మూవీపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు గ్లింప్స్ వీడియో పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూవీను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా చూస్తున్నారు. అయితే మూవీ టీమ్ ముందు ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12 న విడుదల చేస్తామని అన్నారు. సూచనప్రాయంగా ఆ తేదీను కూడా అనౌన్స్ చేశారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విడుదల తేదీను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. మూవీను మరో నాలుగు నెలలకు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారట. అందుకే జనవరిలో కాకుండా మే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మే 9 మూవీను రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారట. అయితే ఇందులో ఏమైనా సెంటిమెంట్ అంశం దాగి ఉందా లేదా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను ఉద్దేశించి డేట్ మారుస్తున్నారా అనేది తెలియరాలేదు. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్ ఎవరూ స్పందించలేదు. దీనిపై మూవీటీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ డేట్ మారడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. 


‘కల్కి 2898 ఏడీ’ కథ ఇదేనా..


‘కల్కి 2898 ఏడీ’ సినిమా టైటిల్ లోనే ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్ అని తెలుస్తుంది. వివిధ యుగాల్లో దుష్ట‌శిక్ష‌ణ కోసం శ్రీ మ‌హా విష్ణువు అనేక‌ అవతారాలు ఎత్తుతాడని, అందులో భాగంగానే కలియుగం అంతంలో కల్కిగా అవతారంగా కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ‘కల్కి 2898 ఏడీ’ తెరకెక్కిందని తెలుస్తోంది. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినపుడు ప్రభాస్ ప్రపంచాన్ని కాపాడే ఆశాకిరణం కల్కి లా వస్తాడని గ్లింప్స్ వీడియోలో చూపించారు. ప్రపంచాన్ని జ‌యించ‌డానికి ఆధునిక ఆయుధాల‌ను సంపాదించుకోవాల‌ని దుష్ట‌శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తుంటాయి. వారిని క‌ల్కి ఎలా అడ్డుకుంటున్నాడ‌న్న‌ది ఈ మూవీ క‌థ అని స‌మాచారం. ఈ మూవీను సుమారు రూ.600 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఇండియాలో అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల్లో ఈ మూవీ మొదటి వరుసలో ఉంటుంది. మరి మూవీ విడుదల అయ్యాక ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 


Also Read: ఐకాన్ స్టార్ అదిరేటి రికార్డ్ - ఆ విషయంలో ఇండియాలోనే తొలి సెలబ్రిటీగా బన్నీ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial