టాలీవుడ్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని, సెన్సేషనల్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి ఇది సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల కింద ముంబైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభమే ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. రీసెంట్ గానే బోయపాటి సినిమాని పూర్తి చేసిన రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ కోసం మాస్ మేకోవర్ లోకి మారిపోయాడు. డబల్ ఇస్మార్ట్ కోసం రామ్ మరింత స్టైలిష్ లుక్ లో మారిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి ఈ సినిమాని ఫ్యాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.


విష్ణు రెడ్డి ఈ చిత్రానికి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ సినిమాకి సంబంధించి ఈ రోజు ఓ అదిరిపోయే అప్డేట్ ని అందించారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్లోనే పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో సినిమా నుండి సంజయ్ దత్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఆయనకి బర్త్డే విషెస్ ను అందజేశారు మేకర్స్. సినిమాలో సంజయ్ దత్ 'బిగ్ బుల్' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్లో పేర్కొన్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో సంజయ్ దత్ నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించారు. ఫుల్ స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. ఫంకి హెయిర్ స్టైల్, గడ్డం లో సూట్ ధరించి , చేతికి ఖరీదైన వాచ్, చెవి పోగులు, వేళ్ళపై పచ్చబొట్లుతో ఉన్న ఆయన సిగరెట్ తాగుతూ అలా చూస్తుంటే గన్ స్పాట్స్ ఆయన్ని టార్గెట్ చేసినట్లు ఉంది.


దీంతో ఈ పోస్టర్ చూసిన నెటిజెన్స్ డబుల్ ఇస్మార్ట్ లో సంజు లుక్ అదిరిపోయిందని అంతేకాకుండా 'కేజీఎఫ్ 2'ను మించేలా ఈ లుక్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పూరి జగన్నాథ్ కి తన సినిమాలో నటీ,నటులను సాధ్యమైనంత ఎక్కువగా మాస్ అప్పీల్ ఉండేలానే వారి పాత్రలను డిజైన్ చేస్తారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్' కోసం సంజయ్ దత్ ను మాస్ స్టైలిష్ లుక్ లో మార్చేశారు. ఇందులో మునుపెన్నడు చూడని అవతార్లో సంజయ్ దత్ని పూరి జగన్నాథ్ ప్రజెంట్ చేయబోతున్నట్లు పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా భాగమవడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నెలకొల్పింది. అంతే కాకుండా ఈ వైల్డ్ కాంబినేషన్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.


ఇక ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉందని సంజయ్ ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేశారు." మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ ఉస్తాద్ రామ్ పోతినేని తో కలసి వర్క్ చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఈ సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ లో బిగ్ బుల్ పాత్ర చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మార్చ్ 8 న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను" అంటూ పేర్కొన్నారు. కాగా ఈ సినిమా కోసం హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. భారీ బడ్జెట్ తో హై లెవెల్ టెక్నికల్ స్టాండర్స్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.