సినిమా ఫలితం ఎలా ఉన్నా... వరుణ్ తేజ్ (Varun Tej) ప్రయత్నంలో మాత్రం ఎటువంటి లోపం ఉండదు. తెలుగు ప్రేక్షకులకు ప్రతిసారి ఒక కొత్త తరహా సినిమా చూపించడానికి మెగా ప్రిన్స్ ఎప్పుడూ తన వంతు ప్రయత్నం చేస్తారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించబోయే సినిమాతో ఆయన కొత్త జోనర్, కొత్త ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు.


ఇండో కొరియా నేపథ్యం... త్వైకాండోలో శిక్షణ!
ఇండో అమెరికా నేపథ్యంలో తాము సినిమా తీశామని కొంత‌ మంది హీరోలు, దర్శక - నిర్మాతలు రచయితలు చెప్పడం తెలుగు ప్రేక్షకులు చూసి ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం... ఇండో కొరియా నేపథ్యంలో ఒక తెలుగు సినిమా రూపొందుతోంది.


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి హిట్ సినిమాలు తీసిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆ సినిమా ఇండో కొరియా (Indo Korean) నేపథ్యంలో తెరకెక్కుతోందని దర్శకుడు తాజాగా వెల్లడించారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ కొరియన్ మార్షల్ ఆర్ట్స్ త్వైకాండోలో శిక్షణ తీసుకోనున్నారు. 


కొరియా నేపథ్యమే కాదు... యాక్షన్ దర్శకులు కూడా!
వరుణ్ తేజ్ వరకు ఇది కొత్త జోనర్ అని దర్శకుడు‌ మేర్లపాక గాంధీ వివరించారు. క్యారెక్టర్ డిజైన్ హీరోకు విపరీతంగా నచ్చింది అని, ‌ఈ సినిమా కోసం ఆయన ఫిజికల్ పరంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారని తెలిపారు. యాక్షన్ కామెడీ సినిమా వరుణ్ తేజ్ చేస్తుండటం ఇదే తొలిసారి. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 2025లో ప్రారంభం కానున్నట్లు తెలిపారు.


ఇండో కొరియా నేపథ్యంలో రూపొందే ఈ సినిమా కోసం కొరియా నుంచి కొంతమంది ఆర్టిస్టులను కూడా తెలుగు సినిమాకు పరిచయం చేయడానికి దర్శకుడు గాంధీ సన్నాహాలు చేస్తున్నారు. ఆ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ''కొరియాలో 40 శాతం సినిమా షూట్ చేయనున్నాం. కొరియాలో ఒక లెంగ్తీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్సులు కూడా తీస్తాం. సినిమాలో అవి మేజర్ హైలైట్ కానున్నాయి. కొరియాలో తీసేసి సన్నివేశాలు యాక్షన్ సీక్వెన్సుల్లో అక్కడ ఆర్టిస్టులను తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. దాని కోసం ఆడిషన్స్ కూడా చేయాలని అనుకుంటున్నాం'' అని మేర్లపాక గాంధీ వివరించారు. కొరియా నుంచి కొంతమంది స్టంట్ డైరెక్టర్లు హైదరాబాద్ వస్తారని, ఇక్కడ ఫైట్ సీక్వెన్స్ తీస్తారని తెలిపారు.


Also Read: 'దసరా' దర్శకుడికి అవకాశం ఇస్తున్న చిరంజీవి - మెగా మాస్ మూవీ లోడింగ్?



డిసెంబర్ 5 నుంచి ప్రైమ్ వీడియోలో 'మట్కా'
Matka OTT Streaming Details: వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'మట్కా' ఆశించిన విజయం సాధించలేదు.‌ 'పలాస', 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాల దర్శకుడు కరుణ కుమార్ తీసిన ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో అనుకున్న వసూళ్ల సాధించలేదు.‌ థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాలకు ఇప్పుడు ఆ సినిమా డిసెంబర్ 5వ తారీఖు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.


Also Readఅల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'