Indian 3 : ఉలగనాయగన్ కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ 'ఇండియన్ 2' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 2001లో కమల్ హాసన్, తో శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో తెలుగులో 'భారతీయుడు' అనే టైటిల్ తో వచ్చిన ఎన్ని రికార్డులు సృష్టించిందో కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో రాబోయే 'భారతీయుడు 2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 'ఇండియన్ 3' కోసం కూడా సన్నాహాలు చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ హింట్ ఇవ్వడం కమల్ హాసన ఫ్యాన్స్ కు మంచి బూస్టప్ ను ఇచ్చింది.


'ఇండియన్ 2' (భారతీయుడు 2) నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, విజువల్స్‌ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుండగా.. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఆన్‌లైన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 'ఇండియన్ 3'కి ఛాన్స్ ఉందని ప్రకటించారు. ఇండియన్ 3' గురించి ఆలోచన ఉందని, అయితే ఇంకా ఏదీ ఫిక్స్ కాలేదని ఉదయనిధి వెల్లడించారు. ఇక 'ఇండియన్ 2' అవుట్ పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నానని, శంకర్, కమల్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రానికి క్రియేట్ అయిన అంచనాలకి తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ లో 'ఇండియన్ 2' మూవీ రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో 'ఇండియన్ 3' పైన కూడా చర్చలు జరుగుతున్నాయని లీక్ చేయడం విశేషం.


దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'ఇండియన్ 2' షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్టు టాక్ కూడా వినిపిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'ఇండియన్ 2'లో కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఢిల్లీ గణేష్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఉదయనిధి చెప్పిన దాని ప్రకారం 2024 ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


అయితే మరో ముఖ్య విషయమేమిటంటే 'ఇండియన్ 2' కి వచ్చే రెస్పాన్స్ బట్టి మళ్లీ కమల్, శంకర్ 'ఇండియన్ 3' మూవీని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 'ఇండియన్ 2' మూవీకి సంబంధించి ప్రస్తుతం సీజీ వర్క్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. కచ్చితంగా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసే చిత్రం అవుతుందని మేకర్స్, కమల్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక శంకర్ ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీపై ఫోకస్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.


Read Also : Devraj Patel Net Worth: చిన్న వయస్సులోనే యూట్యూబ్ కింగ్ అయ్యాడు - లక్షలు సంపాదిస్తున్న సమయంలో అనుకోని విషాదం, దేవరాజ్‌కు ఏమైంది?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial