Oscar: ర్శకుధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ భారీ విజయాన్ని అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాదు సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ను సాధించి తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇప్పుడు టాలీవుడ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అవార్డులు అందజేసే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో ప్యానల్ సభ్యులుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బృందంలో ఆరుగురకి కమిటీలో అవకావం లభించింది. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఈ లిస్ట్ లో రాజమౌళి పేరు లేకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 


తెలుగు వారికి మరో అరుదైన గౌరవం ఇది!


ప్రతీ సంవత్సరం ఆస్కార్ అకాడమీ సినిమా ప్రపంచంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి వివిధ కేటగిరీలలో అవార్డులు ప్రదానం చేస్తారు. ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ లో వేలాది మంది సభ్యులు ఉంటారు. వీరందరికీ అవార్డ్స్ సమయంలో ఓటు వేసే అధికారం ఉంటుంది. అందుకోసమే వీరందరికీ సభ్యత్వం ఇస్తారు. ఇప్పుడు కొత్తగా ఆస్కార్‌ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించారు. వీరిలో ‘ఆర్ఆర్ఆర్’ బృందంలో ఆరుగురికి సభ్యత్వం ఆహ్వానం అందింది. ఆహ్వానం అందుకున్న వారిలో స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌, సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సిరిల్‌ లకు ఈ కమిటీలో స్థానం దక్కింది. వీరితో పాటు దేశవ్యాప్తంగా మణిరత్నం, కరణ్‌జోహార్‌, సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ లకు కూడా ఆస్కార్‌ కమిటీ ఆహ్వానం పలికింది. వీరంతా సభ్యత్వాన్ని ఆమోదిస్తే వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డులలో ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆహ్వానితులందరూ సభ్యత్వాన్ని అంగీకరిస్తే, మొత్తం అకాడమీ సభ్యుల సంఖ్య ఈ ఏడాది 10 వేల 817కి పెరగనుందని వెల్లడించింది కమిటీ ప్యానెల్.


లిస్ట్ లో రాజమౌళి పేరు ఎందుకు లేదు?


ఆస్కార్ అవార్డుల ప్యానెల్ కమిటీలో తెలుగు వారి పేర్లు కూడా ఉండటంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందంపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. అయితే మరో వైపు ‘ఆర్ఆర్ఆర్’ ను తీర్చిదిద్దిన జక్కన్న పేరు ఈ లిస్ట్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడానికి కారణమే రాజమౌళి. అలాంటి రాజమౌళిను ఆస్కార్ ప్యానెల్ విస్మరించడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు. మరి రాజమౌళి పేరును ఎందుకు విస్మరించారు అనే దానికి కారణాలు ఏంటనేది తెలియరాలేదు. ఏదేమైనా రాజమౌళి పేరు కూడా ఈ లిస్ట్ బాగుండేదని పెదవి విరుస్తున్నారు నెటిజన్స్. రాజమౌళి పేరు లేని ఈ అహ్వానాన్ని ‘ఆర్ఆర్ఆర్’ బృందం స్వీకరిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ ఏడాదికిగానూ ఆస్కార్‌ ఆర్గనైజర్స్‌ మెంబర్‌ షిప్‌ దక్కించుకున్న వాళ్లలో 40 శాతం మంది మహిళలు ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆస్కార్‌ వేడుక మార్చి 10న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ మూవీని తెరకెక్కించిన జక్కన్నకు ఆ జాబితాలో స్థానం లభించకపోవడంపై బాధపడాలా, లేదా తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవానికి సంతోషించాలా అని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: ఫస్ట్ డేట్‌లోనే శృంగారం? తమన్నా, విజయ్ బోల్డ్ కామెంట్స్ వింటే షాకవ్వడం ఖాయం