Indian 2 & 3: విశ్వ నటుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో థియేటర్లలో రిలీజైన 'ఇండియన్(భారతీయుడు)' బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. ‘హిందుస్థానీ’ పేరుతో వచ్చిన హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా మంచి హిట్ ను అందుకుంది. అంతే కాకుండా సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాగా 'ఇండియన్' నిలవడం మరో చెప్పుకోదగిన విషయం. ప్రజలను పట్టి పీడిస్తున్న అవినీతి గురించి ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదంటేనే అర్థం చేసుకోవచ్చు.. వారి మనసుల్లో ఈ సినిమా ఎంతగా చొచ్చుకుపోయిందో.


ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమాల్లో 'ఇండియన్ 2' ఒకటి. అయితే శంకర్ పార్ట్ 2తో పాటు పార్ట్ 3 కూడా కంప్లీట్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కంటే ముందే శంకర్ 'ఇండియన్ 2'లో కమల్ హాసన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నామని ప్రకటించిన విషయం విధితమే. అయితే అప్పట్నుంచి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 


శంకర్‌, కమల్‌ హాసన్‌ల కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇండియన్‌'. ఈ సినిమా సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇండియన్ సినిమాను శంకర్ మూడు భాగాల్లో కంప్లీట్ చేయనున్నారు. 'ఇండియన్ 2', 'ఇండియన్ 3' వేరు వేరు సమయాల్లో కాకుండా రెండింటిని ఒకేసారి చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి మొత్తం ఆరు గంటల సినిమాకు ఫుటేజ్ సిద్ధమైనట్టు సమాచారం. అందులో సీక్వెల్ కు సంబంధించిన కంటెంట్ ఉండడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫుటేజ్ లో మరో సీక్వెల్ కు సంబంధించిన కంటెంట్ ఉండడంతో.. రెండు పార్టులను వేరు వేరుగా చేసి.. పరిచయం, విరామం, క్లైమాక్స్ వంటి ఎలివేషన్ పాయింట్‌లతో ఈ సినిమాను నిర్మించినట్టు తెలుస్తోంది. అయితే 'ఇండియన్ 2'లో ముగింపు లేకుండా సీక్వెల్ కు ఛాన్స్ ఉందనే టాక్ రావడంతో.. దర్శకుడు శంకర్ స్క్రీన్ ప్లేలో సరైన ఎలివేషన్ పాయింట్లతో ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. మణిరత్నం ‘పొన్నియెన్ సెల్వన్’ స్ఫూర్తిగా కథను కుదించకుండా రెండు భాగాలుగా రిలీజ్ చేయడమే బెటర్ అని శంకర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.


ఈ క్రమంలో ప్రచారం జరుగుతున్న సమాచారం ప్రకారం, 'ఇండియన్ 2' ఇప్పటికే 100 శాంతం పూర్తైతే.. 'ఇండియన్ 3' మాత్రం 75 శాతం పూర్తైందట. అన్నీ అనుకూలంగా సాగితే.. 'ఇండియన్ 2', 'ఇండియన్ 3'.. 'PS-1', 'PS-2' లాగా కేవలం సంవత్సరం వ్యవధిలోనే రెండు సినిమాలు విడుదల అవుతాయట. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'భారతీయుడు 2' వచ్చే ఏడాది తమిళ నూతన సంవత్సరం రోజు విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.


Read Also : Vishwak Sen: మన సినిమా బాగుందని ఎవరినో కించపరచకూడదు - ఆ దర్శకుడికి మరోసారి చురకలంటించిన విశ్వక్ సేన్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial