Multiplex Association Takes Legal Action Over Early OTT Release Of Bharatheeyudu 2: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'ఇండియన్ - 2' సినిమా ప్రొడ్యూసర్లు చిక్కుల్లో పడ్డారు. సినిమా ఓటీటీ రిలీజ్ పై మల్టీప్లెక్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రూల్స్ కి వ్యతిరేకంగా సినిమా రిలీజ్ చేశారంటూ సీరియస్ అయ్యింది అసోసియేషన్. ఈ మేరకు లీగల్ నోటీసులు ఇష్యూ చేసింది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన భారతీయుడు సినిమాకి కొనసాగింపుగా వచ్చిన 'భారతీయుడు - 2' (ఇండియన్ - 2) జులై 12 న దేశవ్యాప్తంగా రిలీజైంది. అయితే, అనుకున్నంతగా సినిమా ఆడలేదు. ఇక ఆగస్టు 9న ఓటీటీలో రిలీజ్ అయ్యింది సినిమా. హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ చేయడంపై నోటీసులు జారి చేసింది అసోసియేషన్. అసలు ఏమైందంటే?
ముందే రిలీజ్ చేసినందుకు..
హిందీ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల హిందీ వెర్షన్ థియేటర్ లో రిలీజైన 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో రిలీజ్ చేయాలి. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఇటీవలే ఈ రూల్ తీసుకొచ్చింది. అదే రూల్ ని సినిమా ప్రొడ్యూసర్లు కచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంటి. ఈ నేపథ్యంలో 'భారతీయుడు - 2' జులై 12న రిలీజైంది. కాబట్టి రూల్ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ, ఆగస్టు 9నే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్లు. దీంతో నోటీసులు జారీ చేశారు. మల్లీప్లెక్స్ అసోసియేషన్ రూల్స్ కి ఓకే చెప్పిన 'ఇండియన్ - 2' ప్రొడ్యూసర్లు ఆ తర్వాత వాటిని ఉల్లంఘించారని నోటీసులో పేర్కొన్నారు. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, వివరణ ఇవ్వాలని కోరారు.
రూల్స్ ఏంటంటే?
రూల్ ప్రకారం సినిమాని 8 వారాల తర్వాత రిలీజ్ చేయాలి. లేదంటే.. ఆ ప్రొడ్యూసర్లకు సంబంధించిన సినిమాలని టాప్ -3 మల్టీప్లెక్స్ చైన్స్ లో రిలీజ్ చేయరు. పీవీఆర్ ఐనాక్స్, సినిపోలిస్ థియేటర్స్ చైన్లలో సినిమాలను రిలీజ్ చేయరు. దీంతో ఇప్పుడు 'ఇండియన్ - 2' సినిమా ప్రొడ్యూసర్లు చిక్కుల్లో పడ్డట్లు అయ్యింది.
మిశ్రమ స్పందన..
'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా దాదాపు 30 ఏళ్ల తర్వాత 'భారతీయుడు - 2' సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్. ఈ సినిమాలో కమల్ హాసన్ సేతుపతిగా అలరించారు. అయితే, కమల్ హాసన్ యాక్టింగ్ కి పూర్తిగా మార్కులు పడినప్పటికీ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మిశ్రమ స్పందన లభించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు హీరో సిదార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్ జే సూర్య, వివేక్, కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాని ఉదయ్ నిధి స్తాలిన్, సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి కొనసాగింపుగా మూడో పార్ట్ కూడా ఉంటుందని శంకర్ ప్రకటించారు. 3వ పార్ట్ లో కూడా ఈ యాక్టర్స్ ఉంటారని ఆయన అన్నారు.
Also Read: శివాజీ పంచులు, కావ్యా కల్యాణ్ రామ్ టాలెంట్, రష్మీ స్పెషల్ సాంగ్- ఈసారి గణేష్ పండుగంతా ఈటీవీలోనే!