Ilaiyaraaja Legal Action On Manjummel Boys Makers: మామూలుగా తెర వెనుక పనిచేసేవారు ఎక్కువగా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. అంతే కాకుండా అలాంటి వారిలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు కూడా చాలా తక్కువ. ఆ లిస్ట్‌లో మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా కూడా ఉంటారు. తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే ఇళయరాజా.. ఎక్కువగా బయట కనిపించరు. ఈవెంట్స్‌లో కూడా ఆయన ఎక్కువగా పాల్గొనరు. కానీ గత కొంతకాలంగా ఈయన పేరు.. పలు కాంట్రవర్సీల్లో వినిపిస్తోంది. ఇటీవల రజినీకాంత్ అప్‌కమింగ్ మూవీ ‘కూలీ’పై కేసు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన ఇళయరాజా.. ఇప్పుడు ‘మంజుమ్మెల్ బాయ్స్’ను టార్గెట్ చేశారు.


పాటతోనే హిట్..


ఫిబ్రవరీలో విడుదలయిన మలయాళం మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’.. దేశవ్యాప్తంగా ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక మలయాళం సినిమా దేశవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడం సాధ్యమని నిరూపించింది. మలయాళంలోనే కాకుండా తమిళ, తెలుగు భాషల్లో కూడా రికార్డ్ స్థాయిలో దూసుకుపోయింది ‘మంజుమ్మెల్ బాయ్స్’. దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ మూవీ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం గుణ కేవ్స్, ‘‘కమ్మని ఈ ప్రేమ లేఖనే’’ పాటే. ఇళయరాజా కంపోజ్ చేసిన ఎన్నో పాటల్లో ‘గుణ’ చిత్రంలోనే కమ్మని ఈ ప్రేమలేఖనే పాట ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. అయితే తన అనుమతి లేకుండా ‘మంజుమ్మెల్ బాయ్స్’లో తన పాటను ఉపయోగించడం మ్యూజిక్ మేస్ట్రోకు నచ్చలేదు.


ముందుగానే ఒప్పందం..


ఎవర్‌గ్రీన్ క్లాసిక్ సినిమాను, అందులోని పాటను ఇప్పటి సినిమాల్లో ఉపయోగించుకోవాలి అనుకుంటే మేకర్స్.. ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాలి. అయితే ‘గుణ’లోని కమ్మని ఈ ప్రేమలేఖనే పాటను ఉపయోగించుకోవడం కోసం ఆ పాట ఆడియో రైట్స్ ఉన్న మ్యూజిక్ కంపెనీ దగ్గర అనుమతి తీసుకున్నారు ‘మంజుమ్మెల్ బాయ్స్’ మేకర్స్. పర్సనల్‌గా ఇళయరాజాను ఈ విషయం అడగకపోయినా మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఏ సమస్య రాదనే నమ్మకంతో వారు ఆ పాటను సినిమాలో పలుమార్లు ఉపయోగించుకున్నారు. కానీ ‘మంజుమ్మెల్ బాయ్స్’పై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఇళయరాజా.. వారికి షాకిచ్చారు. ఇప్పటికే మూవీ టీమ్‌కు ఇళయరాజా తరపున లాయర్.. లీగల్ నోటీసులను కూడా పంపించారు.


ఫ్రెండ్‌షిప్ సాంగ్..


కొన్ని రోజుల క్రితమే ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా ఓటీటీలో కూడా వచ్చేసింది. ఒకవేళ ఇళయరాజా.. లీగల్ పరంగా గెలిస్తే.. ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ సినిమాలోని పాటను కూడా మ్యూట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మూవీలోని సోల్ మిస్ అవుతుంది. దీంతో ‘మంజుమ్మెల్ బాయ్స్’ మేకర్స్ త్వరగా ఈ సమస్యపై స్పందించాలని మూవీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా మొత్తం గుణ కేవ్స్ చుట్టూనే తిరుగుతుంది. అంతే కాకుండా కమ్మని ఈ ప్రేమ లేఖనే లాంటి ప్రేమ పాటను ఒక ఫ్రెండ్‌షిప్ సాంగ్‌గా మార్చి క్లైమాక్స్‌లో యాడ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు దర్శకుడు. ఇప్పుడు క్లైమాక్స్‌లో ఆ పాట వినిపించకపోతే ఆడియన్స్ కచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు.


Also Read: 'భారతీయుడు 2' నుంచి ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది - గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న పవర్ఫుల్‌ సాంగ్‌