ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు 'పుష్ప' మేకర్స్. ఒకరోజు ముందుగానే 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా సందడి చేయబోతోంది. ఈ విషయాన్ని తాజాగా నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
ఒకరోజు ముందుగానే 'పుష్ప 2' రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా భారీ యాక్షన్ ఎంటర్టైన 'పుష్ప 2'. ఫస్ట్ పార్ట్ 'పుష్ప : ది రైజ్' సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూవీ రిలీజ్ కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ తాజాగా చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సినిమా షూటింగ్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. 'పుష్ప 2' మూవీని ఇంతకుముందు ప్రకటించిన రిలీజ్ డేట్ కంటే ఒకరోజు ముందే రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. ఇప్పటిదాకా డిసెంబర్ 6న 'పుష్ప 2' థియేటర్లలోకి రాబోతుందని చెప్పారు. తాజా అనౌన్స్మెంట్ ప్రకారం ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం మేకర్స్ చేసిన ఈ తాజా అనౌన్స్మెంట్ పై బన్నీ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు పోస్ట్ పోన్.. ఇప్పుడు ప్రీపోన్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కింది 'పుష్ప : ది రైజ్'. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'పుష్ప' 2021 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్లను కూడా అందుకోవడం విశేషం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన 'పుష్ప' సినిమాలో పుష్పరాజ్ కూలిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి ఎర్రచందనం సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఇంట్రెస్టింగ్ విషయాలతో ఫస్ట్ పార్ట్ రూపొందింది. ఇక ఆ తర్వాత అతడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ? వాటిని ఎలా దాటాడు ? అనే విషయాన్ని 'పుష్ప : ది రూల్' పేరుతో రిలీజ్ కాబోతున్న సెకండ్ పార్ట్ లో చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ మారడం అనేది ఇదే మొదటి సారి కాదు. నిజానికి ముందు ఆగస్టు 15న 'పుష్ప 2' మూవీని రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్ పలు కారణాల వల్ల డిసెంబర్ 6 కి వాయిదా వేశారు. ఇప్పుడు ప్రీపోన్ చేసి డిసెంబర్ 5కు మార్చారు రిలీజ్ డేట్ ని. లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందనే రీజన్ తో డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇలా మార్చామని మేకర్స్ స్పష్టం చేశారు.