Ranveer-Deepika New Car: బాలీవుడ్ స్టార్ యాక్టర్లు గా కొనసాగుతున్న రణవీర్ సింగ్, దీపికా దంపతులు రీసెంట్ గా తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. కొద్ది రోజుల క్రితమే దీపికా పండంటి పాపకు జన్మనిచ్చింది. రీసెంట్ గా దీపికా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. ఓవైపు పేరెంట్స్ గా మారినందుకు ఫుల్ హ్యాపీగా ఉన్న రణవీర్ దంపతులు తాజా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దీని కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ కొత్త కారులు తన సెంటిమెంట్ నెంబర్ ప్లేట్ తెచ్చుకునేందుకు సైతం భారీగా ఛార్జ్ చెల్లించారట.  


రణవీర్ కొనుగోలు చేసిన లగ్జరీ కారు ఇదే!


ఇప్పటికే రణవీర్ సింగ్ గ్యారేజీలో బోలెడు కార్లు ఉన్నాయి. అందుకొన్ని విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన మరో కారు చేరింది. తాజాగా ఆయన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. 4.4 LWB కారు రేంజ్ రోవర్ సిరీస్ లోనే అత్యుత్తమ టాప్ ఎండ్ కార్లలో ఒకటి. ఆయన కూతురు కోసం ఈ కారులో స్పెషల్ గా కొన్ని మార్పులను  చేయించినట్లు తెలుస్తోంది. ఈ కారు కోసం ఆయన ఏకంగా రూ. 4.74 కోట్లు ఖర్చు చేశారట. అంతేకాదు, ఈ కారుకు తన సెంటిమెంట్ నెంబర్ 6969ను తీసుకున్నారు. దీని కోసం ఆయన ఆర్టీఏకి పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించారట. ఇప్పటికే రణవీర్ చెందిన మూడు కార్లకు ఇదే నెంబర్ ఉండగా, ఇప్పుడు నాలుగో కారుకు కూడా ఇదే నెంబర్ తీసుకున్నారు.   






2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న రణవీర్, దీపికా


బాలీవుడ్ స్టార్లు రణవీర్ సింగ్, దీపికా పదుకొనె కలిసి పలు సినిమాల్లో నటించారు. తొలుత సంజయ్ లీలా భన్సాలీ  రొమాంటిక్ డ్రామా ‘గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా’లో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత  ఇద్దరూ కలిసి ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్‌’ చిత్రాల్లో నటించారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. సుమారు 6 ఏండ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. తాజాగా దీపికా ఓ బిడ్డకు జన్మనిచ్చింది.


దీపికా, రణవీర్ సినిమాల గురించి..


రణవీర్ సింగ్, దీపికా పదుకొనే కలిసి నటించిన ‘సింగం అగైన్’ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు రణవీర్ ‘దురంధర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అటు శంకర్ దర్శకత్వంలో ‘అన్నియన్’ అనే హిందీ రీమేక్ లో నటించనున్నారు. ఇక దీపికా పదుకొణె చివరగా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఆమె సుమతి అనే పాత్ర పోషించింది. నాగ్ అశ్విన్ దర్శతత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా పలువురు కీలకపాత్రలు పోషించారు.    


Read Also: ఊహలకు అందని రీతిలో ‘కేజీఎఫ్ 3’... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాకీ భాయ్