Allu Arjun about Kalki 2898 AD Movie: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ 'కల్కి 2898 - AD'. ఇందులో సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. జూన్ 27 గురువారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షులని విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలి ఆట నుంచే యునానిమాస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా చూసిన సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హీరో అల్లు అర్జున్ మూవీ టీమ్ ను మెచ్చుకుంటూ 'ఎక్స్' లో పోస్ట్ పెట్టారు.

"అద్భుతమైన విజువల్ వండర్ ను అందించిన 'కల్కి 2898 AD' టీమ్‌కి ధన్యవాదాలు. నా ప్రియ మిత్రుడు ప్రభాస్ ఇలాంటి ఎపిక్ చిత్రాన్ని అందించాడు. సూపర్ హీరోయిక్ ప్రెజెన్స్ తో అలరించారు. అమితాబ్ బచ్చన్ గారు నిజంగా స్ఫూర్తిదాయకం.. మాటలు రావడం లేదు. తదుపరి భాగంలో కమల్‌ హాసన్‌ సార్ విశ్వరూపం కోసం ఎదురు చూస్తున్నాను. దీపికా పదుకొనే అప్రయత్నంగా అద్భుతంగా నటించారు. దిశా పటాని ఆకర్షణీయమైన ఉనికిని చాటుకున్నారు." అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అందరినీ విస్మయానికి గురి చేశారని, అతను ఈ జనరేషన్ పాత్ బ్రేకింగ్ ఫిలి మేకర్ అని బన్నీ పేర్కొన్నారు.

"సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిటర్, మేకప్‌ ఆర్టిస్ట్స్, ఇతర సాంకేతిక సిబ్బందికి నా అభినందనలు. రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని పెంచిన వైజయంతీ ఫిల్మ్స్ అధినేత అశ్వినీదత్ గారికి, స్వప్న దత్, ప్రియాంక దత్‌ లకు ప్రశంసలు. ఇక కెప్టెన్ నాగ్ అశ్విన్ గారు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని విస్మయానికి గురి చేశారు. మా తరానికి మార్గనిర్దేశం చేసిన దర్శకుడికి అభినందనలు. గ్లోబల్ స్టాండర్డ్స్ కు సరిపోయే మన ఇండియన్ కల్చరల్ సెన్సిబిలిటీస్ తో కూడిన విజువల్ వండర్ ను అందించారు." అని అల్లు అర్జున్ పోస్ట్ పెట్టారు.

అమితాబ్ బచ్చన్ ఒరిజినల్ మాస్ హీరో - కింగ్ నాగార్జున

కింగ్ అక్కినేని నాగార్జున సైతం 'కల్కి 2898 ఏడీ' సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. "సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన 'కల్కి 2898 AD' టీమ్‌కి అభినందనలు. నాగి మీరు మమ్మల్ని మరొక సమయానికి, మరొక లోకానికి తీసుకెళ్లారు. ఇది పురాణాలు, చరిత్రతో అల్లుకున్న గొప్ప కల్పన. అమితాబ్ బచ్చన్ గారు అసలైన మాస్ హీరో.. సార్, మీరు నిప్పులు కురిపించారు. సీక్వెల్‌లో కమల్‌ హాసన్ గారిని చూడటానికి వేచి ఉండలేను. ఆయనకు ఇది సరిపోలేదు. ప్రభాస్ నువ్వు మరోసారి సాధించావ్. దీపికా పదుకునే డివైన్ మదర్ గా చాలా అద్భుతంగా, కన్విన్సింగ్‌గా నటించారు. మిగిలిన టీమ్ అందరికీ అభినందనలు. అశ్విని దత్, ప్రియాంక, స్వప్న గాడ్ బ్లెస్ యూ. ఇండియన్ సినిమా మళ్లీ చేసి చూపించింది" అని నాగ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Also Read: 'క‌ల్కీ 2898 AD'పై ర‌జ‌నీకాంత్ ప్ర‌శంస‌లు - సూప‌ర్ స్టార్ ఏమ‌న్నారంటే?