I Bomma :సినిమాలను, వెబ్సిరీస్లను పైరసీ చేస్తూ వెబ్సైట్లో పెట్టిన బొమ్మ(ప్రస్తుతం బప్పమ్‌ టీవీ) నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. పైరసీ విషయంలో పోలీసులకు గతంలో అతను సవాల్ చేశాడు. దమ్ముంటే పట్టుకోవాలని, అందరి పర్శనల్వివరాలు బయటపెడతానంటూ బెదిరించాడు. బెదిరింపును పోలీసులు సీరియస్గా తీసుకొని ఇన్నిరోజులు కాపు కాసి ఆయన్ని పట్టుకున్నారు. హైదరాబాద్లోని కుకట్పల్లిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Continues below advertisement

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలను అదే రోజు వెబ్సైట్లో పెడుతూ తీవ్ర చర్చనీయాంశమైందీ బొమ్మ పైరేడెట్వెబ్సైట్‌. అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి కూడా వెబ్సైట్పేరు సినిమా నిర్మాతల మధ్య చర్చకు వచ్చేది. పోలీసులకు నిర్మాతల మండలి ఫిర్యాదులు చేసేది. కానీ ఇంత వరకు సీరియస్గా యాక్షన్ తీసుకున్నది లేదు. మధ్యకాలంలో సినిమా పరిశ్రమ నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు గట్టి చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా నెల రోజుల క్రితం కీలకమైన ముఠాను అరెస్టు చేశారు.

Continues below advertisement

ఐదుగురు సభ్యులు ఉన్న ముఠాను అరెస్టు చేసిన సందర్భంగా అప్పటి సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ పైరసీ వెబ్సైట్లు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించినా సరే పట్టుకుంటామని అన్నారు. ముఖ్యంగా బొమ్మ వంటి సంస్థలను వదిలిపెట్టేదేలేదని హెచ్చరించారు. పోలీసులు హెచ్చరిక జారీ చేసిన వెంటనే ఐబొమ్మ పోలీసులకు సవాల్ చేసింది. దమ్ముంటే తమను పట్టుకోవాలని ఛాలెంజ్ చేసింది. తమను పట్టుకుంటే ఎవరిని ఎక్కడ ఫోకస్ చేయాలో తమకు తెలుసని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తమ దగ్గర చాలా మంది ప్రైవేటు డేటా ఉందంటూ బెదిరింపులకు దిగింది. మొత్తాన్ని ఇన్ని రోజులు విచారణ చేసిన పోలీసులు కీలక వ్యక్తిని అరెస్టు చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచి పైరసీ సినిమాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ వచ్చారు.

ఫ్రాన్స్లో ఉంటూ సినిమా వాళ్లకు చుక్కలు చూపించాడు రవి. ఫ్రాన్స్ నుంచి వచ్చిన వెంటనే ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. థియేటర్లలో లేదా OTTలో సినిమా రిలీజ్ అయిన వెంటనే అప్‌లోడ్ చేస్తున్నాడు. దీనివల్ల సినిమా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఇప్పటికే వెబ్సైట్పై వందల ఫిర్యాదులు ఉన్నాయి. వీళ్లంతా కూడా విదేశాల్లో ఉంటూ సినిమాలు పైరసీ చేస్తుండటంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్లు దేశానికి వచ్చినప్పుడు మాత్రమే అరెస్టు చేయగలుగుతున్నారు. పైరసీ స్థాయిలో పెరిగిపోవడానికి ఇది కూడా కారణమని పోలీసులు చెబుతున్నారు.

రవి భార్య నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. ఫ్రాన్స్లో ఉంటూ వివిధ దేశాల్లో తన నెట్వర్క్ను విస్తరించాడు. మఖ్యంగా కరేబియన్ దీవుల నుంచి వెబ్సైట్ను మేనేజ్ చేస్తూ వచ్చాడు. విషయాలు తెలిసినప్పటికీ పోలీసులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆయన్ని అరెస్టు చేసిన తర్వాత కీలక విషయాలు తెలుసుకున్నారు. అతని వద్ద లెటెస్ట్ సినిమాలకు సంబంధించిన వివరాలు, ప్రింట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలను కూడా అధికారులు ఫ్రీజ్ చేశారు.