ప్రేక్షకులను విపరీతంగా నవ్వించి, వినోదంతో భారీ విజయం అందుకున్న సినిమా 'సామజవరగమన' (Samajavaragamana Movie). హీరో శ్రీ విష్ణుకు మాత్రమే కాదు, ఆ సినిమాలో నటించిన కథానాయిక రెబా మోనికా జాన్ (Reba Monica John)కు కూడా మంచి పేరు వచ్చింది. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. అసలు నిజం చెప్పాలంటే... 'సామజవరగమన' కోసం ఆమె హైదరాబాద్ రాలేదు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం వచ్చారు. ఆ విషయాలు ఆవిడ మాటల్లోనే... 


'బ్రో' సినిమా ఆడిషన్స్ చేశా కానీ...
''నేను 'బ్రో' సినిమా లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఆ సమయంలో వేరే స్నేహితుడి ద్వారా 'సామజవరగమన' నిర్మాత రాజేష్ దండ గారిని కలిశా. అప్పుడు వేరే సినిమా కోసం అనుకున్నాను. ఆ తర్వాత రామ్ అబ్బరాజు కథ నచ్చడంతో 'సామజవరగమన' ఓకే చేశా. 'బ్రో'లో చేయకపోయినా... 'సామజవరగమన' చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. 'బ్రో'లో పని చేసే అవకాశం రాకపోయినా భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను''. 


నేను మలయాళీ... కానీ పెరిగిందంతా!
''నేను మలయాళీ! అయినా... నేను పెరిగింది బెంగళూరులో! చదువు పూర్తి చేసిన తర్వాత కొన్ని యాడ్స్ చేశా. ఆ తర్వాత మలయాళ సినిమాల్లో నటించా. వాటిలో 'ఫారెన్సిక్' మంచి పేరు తెచ్చింది. నేను నటించిన తెలుగు, తమిళ సినిమా 'భూ' ఓటీటీలో విడుదలైంది. అయితే... తెలుగులో థియేటర్లలో విడుదలైన నా మొదటి సినిమా 'సామజవరగమన'. ఇది నాకు చాలా స్పెషల్. శ్రీ విష్ణుతో పరిచయం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. నరేష్, శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ వల్ల నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగా''.


Also Read అసలు సిసలైన పాన్ ఇండియా కాస్ట్ - మోహన్ లాల్ 'వృషభ' షూటింగ్ మొదలు


''దర్శకుడు రామ్ అబ్బరాజు నా నుంచి న్యాచురల్ యాక్టింగ్ రాబట్టుకున్నారు. స్క్రీన్ మీద నేను కొత్తగా ఉన్నానని మా ఫ్రెండ్స్ కూడా అప్రిషియేట్ చేశారు. ఇంతకు ముందు నేను ఇతర దక్షిణాది భాషల్లో సినిమాలు చేసినా... ఈ తెలుగు సినిమా తీసుకు వచ్చిన గుర్తింపు ఏదీ తీసుకు రాలేదు''. 


విజయ్ 'బిగిల్'లో కూడా నటించా!
''ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో పాటు చాలా మంది 'సామజవరగమన'లో నా నటన బావుందని మెచ్చుకుంటూ ప్రశంసించారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. దళపతి విజయ్ గారితో నటించాలని నా కోరిక. అది 'బిగిల్'తో తీరింది. చిన్న క్యారెక్టర్ అయినా సరే చేస్తానని దర్శకుడు అట్లీ గారిని కలిశా. ఆయన ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు. కథలో ఇంపార్టెన్స్ ఉంటే...  తెలుగులో కూడా ఎటువంటి క్యారెక్టర్లు అయినా చేస్తాను''.


Also Read : 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్'గా నితిన్ - హీరో వేరియేషన్ చూశారా?



రెబా మోనికా జాన్ నటించిన మలయాళ సినిమా ఒకటి విడుదలకు రెడీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో కథలు వింటున్నానని, త్వరలో ఓ సినిమా 'సామజవరగమన' లాంటి మంచి కథ కోసం ఎదురు చూస్తున్నానని, త్వరలో కొత్త సినిమా వివరాలు వెల్లడిస్తానని ఆమె చెప్పారు. 





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial