Naveen Chandra's Honey Movie Total Collections: దర్శకుడిగా పరిచయమైన 'పలాస 1978', ఆ తర్వాత సుధీర్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన 'శ్రీదేవి సోడా సెంటర్'తో కరుణ కుమార్ విజయాలు సొంతం చేసుకున్నారు. ఆయనలో మంచి కథకుడు, దర్శకుడు ఉన్నారని పేరు వచ్చింది. అయితే... ఆ తర్వాత తొలి రెండు సినిమాల స్థాయికి తగ్గ విజయాలు రాలేదు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'హానీ'. బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు సందడి చేయలేదు.

'హానీ' టోటల్ కలెక్షన్స్ ఎంత?Honey Telugu Movie Closing Collection: 'హానీ' సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటించారు. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఇది. థియేటర్లలో ఫిబ్రవరి 6న విడుదల అయ్యింది. దీనికి ముందు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'మట్కా' సినిమా చేశారు కరుణ కుమార్. ఆ మూవీ బడ్జెట్ వేరు, ఆ స్కేల్ వేరు. ఆ సినిమాతో 'హానీ'ని కంపేర్ చేయలేము. ఎందుకంటే... 'హానీ' బడ్జెట్, క్యాస్టింగ్ తక్కువ. ఆ స్థాయికి తగ్గట్టు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సందడి చేయలేదు.

Also Read: Seetha Payanam First Week Collection: 'సీతా పయనం' ఫస్ట్ వీక్ కలెక్షన్స్... లెక్కల్లో తార్‌మార్... అనౌన్స్‌ చేసిన దాంట్లో సగంలో సగం కూడా రాలేదా? మరీ అంత పెంచారా?

'హానీ' సినిమాకు మొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 8 లక్షల రూపాయల నెట్ లభించింది. ఆ తర్వాత వరుసగా రూ. 4 లక్షలు, రూ. 2 లక్షలు, రూ. 4 లక్షలు, లక్ష రూపాయల నెట్ రాబట్టింది. థియేటర్లలో విడుదలైన ఆరో రోజు (అంటే ఫిబ్రవరి  11వ తేదీ, బుధవారం) రూ. 7 లక్షలు నెట్ కలెక్షన్ రాబట్టింది. ఆ తర్వాత రెండు లక్షలు, తర్వాతర్వాత లక్షకు పడింది. థియేటర్లలో విడుదలైన పదో రోజు తర్వాత సినిమాకు వచ్చే ప్రేక్షకులు కనబడలేదు. దాంతో 'హానీ' టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ రూ. 30 లక్షలకు పరిమితం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా గ్రాస్ 35 లక్షల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు సమాచారం ఇచ్చాయి.

Also ReadHey Balwanth Box Office Collection: సుహాస్ సినిమాకు ఊహించని ఓపెనింగ్స్... 'హే బల్‌వంత్' మొదటి రోజు కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Honey Telugu Movie OTT Release Date: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై నటించిన సైకలాజికల్ హారర్ సినిమా 'హనీ'. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు, తమిళంతో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. శేఖర్ స్టూడియోస్ సమర్పణలో OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం మీద రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఓటీటీలో ఈ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి. థియేటర్లకు ఆశించిన స్థాయిలో జనాలు రాలేదు కనుక ఓటీటీలో ట్రెండ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

Also ReadBookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?