Aishwarya Arjun's Seetha Payanam First Week India Net Collection: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'సీతా పయనం'. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ కథానాయికగా పరిచయమైన చిత్రమిది. ఇందులో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అన్నయ్య కుమారుడు నిరంజన్ హీరో. ఫిబ్రవరి 14న విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంతో తెలుసా?

ఎనిమిది కోట్లు కాదు... కొట్టిన్నర గ్రాస్!Seetha Payanam First Week Gross Collection: నాలుగు రోజుల్లో 'సీతా పయనం' సినిమా ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం కోటిన్నర మాత్రమే కలెక్ట్ చేసిందని టాక్. తెలుగులో రూ. 74 లక్షలు, కన్నడలో రూ. 40 లక్షలు, తమిళంలో రూ. 16 లక్షలు, మలయాళంలో రూ. 7 లక్షల నెట్ మాత్రమే కలెక్ట్ చేసిందట. ఏ భాషలో ఏ రోజు ఎంత నెట్ కలెక్ట్ చేసింది? అనేది చూడండి:

సీతా పయనంతెలుగు (లక్షల్లో)తమిళం (లక్షల్లో)కన్నడ (లక్షల్లో)మలయాళం (లక్షల్లో)
మొదటి రోజు
165111
రెండో రోజు
18591
మూడో రోజు
12163
నాలుగో రోజు
1261
ఐదో రోజు
1121
ఆరో రోజు512-
ఏడో రోజు314
ఫస్ట్ వీక్ టోటల్:74 16407

Also ReadHey Balwanth Box Office Collection: సుహాస్ సినిమాకు ఊహించని ఓపెనింగ్స్... 'హే బల్‌వంత్' మొదటి రోజు కలెక్షన్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇండియాలో మొదటి వారంలో 'సీతా పయనం' సినిమా రూ. 1. 37 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ. 1. 51 కోట్లు. మొదటి వారం తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలయాళంలో ఐదు రోజుల తర్వాత దుకాణం సర్దేసింది.

Also ReadBookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?

ఐశ్యర్య అర్జున్, నిరంజన్ జంటగా నటించిన 'సీతా పయనం' సినిమాలో ప్రకాష్ రాజ్, సత్యరాజ్, 'యాక్షన్ కింగ్' అర్జున్, కన్నడ హీరో ధ్రువ సర్జా, బిత్తిరి సత్తి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతంపై విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు మొదటి నుంచి మిశ్రమ స్పందన లభించింది. బాక్స్ ఆఫీస్ బరిలోనూ ఆశించిన కలెక్షన్లు రాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also ReadNawab Cafe Review - 'నవాబ్ కేఫ్' రివ్యూ: ఇడ్లీ కొట్టు ప్లస్ ఉస్తాద్ హోటల్… సినిమా ఎలా ఉందంటే?