Hey Balwanth First Day Collections: యూట్యూబ్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగిన నటుడు సుహాస్. హీరో అయ్యాక కొన్ని మంచి సినిమాలు చేశాడు. అయితే లాస్ట్ ఇయర్ అతనికి సరైన సక్సెస్ రాలేదు. సుహాస్ 2.ఓ అంటూ ఫిబ్రవరి 20న 'హే బల్‌వంత్'తో థియేటర్లలోకి వచ్చాడు. మరి, ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్? థియేటర్లకు జనాలు వచ్చారా? లేదా? ఏమైంది? అనేది ఒక లుక్ వేయండి. 

'హే బల్‌వంత్' ఓపెనింగ్ డే కలెక్షన్ ఎంతంటే?పెయిడ్ ప్రీమియర్ షోలతో 'హే బల్‌వంత్' విడుదల అయ్యింది. ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి కొన్ని నగరాల్లో షోలు వేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మర్నాడు థియేటర్లకు జనాలు వచ్చారు. ఆక్యుపెన్సీ కొంత తక్కువ ఉన్నప్పటికీ... ఓపెనింగ్స్ మాత్రం బావున్నాయ్.

Also ReadBookie Review - 'బూకి' రివ్యూ: సునీల్, లక్ష్మీ మంచు చేసిందేమిటి? విజయ్ ఆంటోనీ మేనల్లుడి సినిమా హిట్టా? ఫట్టా?

Hey Balwanth Opening Day India Net Collection: ఇండియాలో మొదటి రోజు 'హే బల్‌వంత్' సినిమాకు 80 నుంచి 90 లక్షల రూపాయల నెట్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ కోటి రూపాయలకు పైగా వచ్చినట్టు తెలిసింది. హీరోగా సుహాస్ లాస్ట్ థియేట్రికల్ రిలీజ్ 'ఓ భామ అయ్యో రామా'. ఆ సినిమా ఫస్ట్ డే ఇండియా నెట్ 30 లక్షలు మాత్రమే. దానితో కంపేర్ చేస్తే... 'హే బల్‌వంత్' మూడు రేట్లు విజయం సాధించినట్టు. శుక్రవారంతో పోలిస్తే శనివారం కలెక్షన్స్ మరింత పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్ నుంచి 72 వేల డాలర్లు వచ్చాయి.

Also ReadNawab Cafe Review - 'నవాబ్ కేఫ్' రివ్యూ: ఇడ్లీ కొట్టు ప్లస్ ఉస్తాద్ హోటల్… సినిమా ఎలా ఉందంటే?

'హే బల్‌వంత్' సినిమాలో సుహాస్ సరసన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శివానీ నాగరం కథానాయికగా నటించారు. సీనియర్ నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, హర్షవర్ధన్ తదితరులు నటించారు. ఈ సినిమాను వంశీ నందిపాటి, బన్నీ వాస్ విడుదల చేశారు. ఈ సినిమాకు గోపీ అచ్చర దర్శకత్వం వహించగా... బి నరేంద్ర రెడ్డి నిర్మించారు.

Also ReadHey Balwanth Review - 'హే బల్‌వంత్' రివ్యూ: సుహాస్ సినిమా హిట్టా? ఫట్టా? బిజినెస్ అంటూ చేసిన కామెడీ ఎలా ఉందంటే?