సినిమాలో ఒక యాక్టర్ పాత్ర ఎంతసేపు ఉందనేది కాదు.. ఆ పాత్ర వల్ల ప్రేక్షకులు ఎంత ప్రభావితం అయ్యారు అనేది ముఖ్యం. అందుకే ఒక్కొక్కసారి యాక్టర్స్ చేసే చిన్న చిన్న పాత్రలు వారికి ఎంతో గుర్తింపును తెచ్చిపెడతాయి. అదే విధంగా కొన్ని కథలు.. నటించే ప్రతీ యాక్టర్‌కు సమానంగా ప్రాధాన్యతను ఇస్తాయి. తాజాగా విడుదలయిన ‘హాయ్ నాన్న’ కథ కూడా అలాంటిదే. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్ పాత్రలు మాత్రమే కాదు.. మరెన్నో ఇతర నటీనటుల పాత్రలు, వారి క్యారెక్టరైజేషన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులో అంగద్ బేడీ పాత్ర కూడా ఒకటి. అందుకే అంగద్‌ను తానే స్వయంగా ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టాడు నాని.


ఎదురుచూస్తుంటాను..
‘హాయ్ నాన్న’లో అంగద్ బేడీ పర్ఫార్మెన్స్ గురించి చెప్తూ.. నాని ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేశాడు. ‘‘నువ్వు నీ అంత అద్భుతంగా ఉన్నందుకు థాంక్యూ అంగద్. అరవింద్ అనే పాత్రను చాలా అందంగా ప్లే చేసి హాయ్ నాన్నకు ఒక పిల్లర్‌లాగా నిలబడ్డావు. నువ్వు ఒక టీం ప్లేయర్‌లాంటివాడివి. మళ్లీ నీతో కలిసి నటించడానికి ఎదురుచూస్తుంటాను’’ అని నాని చెప్పుకొచ్చారు. హిందీలో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి బాలీవుడ్‌లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అంగద్ బేడీ. కానీ తెలుగులో ‘హాయ్ నాన్న’నే తన మొదటి చిత్రం. డాక్టర్ అరవింద్ పాత్ర అనేది ఈ సినిమాలో చాలా కీలకంగా ఉండగా.. అలాంటి పాత్రకు అంగద్ పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు.


ఒకే ఏడాది రెండు హిట్లతో..
నాని, మృణాల్ ఠాకూర్‌తో పాటు అంగద్ బేడీ పాత్రను కూడా చాలా జాగ్రత్తగా రాసుకున్నాడు దర్శకుడు శౌర్యువ్. ఈ ఏడాది అంగద్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్‌ను సాధించాయి. ముందుగా ఆర్ బల్కి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గూమర్’ చిత్రంలో కూడా అంగద్ గుర్తుండిపోయే పాత్రలో నటించాడు. ఇందులో అభిషేక్ బచ్చన్, గౌరీ షిండే లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’లో కూడా కీలక పాత్రలో కనిపించి మరో హిట్ కొట్టాడు. ‘హాయ్ నాన్న’లో అంగద్ బేడీ నటన అద్భుతంగా ఉండడంతో తనకు తెలుగులోనే మరికొన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతే కాకుండా నాని కూడా తనతో కలిసి మళ్లీ పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను అనడంతో మళ్లీ వీరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు ఫ్యాన్స్.


కలెక్షన్స్ అదుర్స్..
దర్శకుడిగా ‘హాయ్ నాన్న’ అనేది శౌర్యువ్ మొదటి చిత్రమే అయినా.. ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా ఒక సింగిల్ తండ్రి లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చూపించాడు. అందులో తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని చేర్చి సినిమాను మరింత అందంగా మలిచాడు. అందుకే ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ‘హాయ్ నాన్న’ ప్రేక్షకులందరికీ తెగ నచ్చేస్తోంది.


Also Read: ‘యానిమల్’ కోసం తృప్తి రెమ్యునరేషన్ అంతేనా? క్రేజ్‌కు, పారితోషికానికి సంబంధమే లేదు!