Friendship Songs In Telugu: ఎప్పుడూ మన పక్కనే ఉంటూ, మనల్ని గైడ్ చేసే ఫ్రెండ్స్ కోసం స్పెషల్‌గా ఒకరోజు కేటాయిస్తే ఎంత బాగుంటుంది.. ఆరోజు కేవలం ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, సినిమాలు చూసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అందుకే ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీరు మీ ఫ్రెండ్స్‌తో కలిసి పాడుకునే పాటలు తెలుగులోనే చాలా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.
హుషారు తెప్పించే పాట..
కొందరు స్నేహితులు జీవితాన్ని సీరియస్‌గా తీసుకోకుండా తిరుగుతూ ఉంటారు. అలాంటి వారికి ఒక్కసారిగా బాధ్యతలు అనేవి తెలిస్తే ఎలా ఉంటాయి అన్నదే ‘హుషారు’. ఈ సినిమాలో ఫ్రెండ్స్ అంతా కలిసి పాడుకోవడం కోసం హుషారే అనే పాటను కూడా రాశారు కృష్ణకాంత్. జీవితంలో అన్ని కష్టాలు కలిసి దాటిన తర్వాత సంతోషం వైపు అడుగులేస్తూ పాడుకునే పాట ఇది. దీనికి సన్నీ ఎమ్ఆర్ అందించిన సంగీతం పాటను వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంది.
మరపురాని ముస్తఫా..
‘ప్రేమదేశం’ అనే సినిమా విడుదలయ్యి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ సినిమా చూడని ప్రేక్షకులు కూడా ఉండొచ్చు. కానీ ఇందులోని ముస్తఫా ముస్తఫా అనే పాటను వినని ప్రేక్షకులు మాత్రం చాలా అరుదు. ఇప్పటికే ఫ్రెండ్‌షిప్ డే వస్తే ఇదే పాటను పాడుకుంటూ ఉంటారు స్నేహితులు. తమ ఫ్రెండ్‌ను కూల్ చేయాలన్నా, తన నుండి ఏదైనా సాయం పొందాలన్నా ఇప్పటికీ ఈ పాటే ఆయుధం.
ఓ మై ఫ్రెండ్..
‘హ్యాపీ డేస్’ సినిమా అనేది ఇంజనీరింగ్ కాలేజ్‌లో పరిచయమయ్యి.. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అందరికీ అంకితం. చెప్పాలంటే ఇదొక సగలు బీటెక్ స్టూడెంట్ బయోపిక్. ఇలాంటి సినిమాలో ‘ఓ మై ఫ్రెండ్’ అంటూ సాగే పాటను ఫేర్‌వెల్ పార్టీలో ప్లే చేస్తే ఫ్రెండ్స్ కంట కన్నీళ్లు రాక తప్పదు. ముఖ్యంగా ఈ పాటను తన వాయిస్‌తో ప్రాణం పోశాడు కార్తిక్. ‘హ్యాపీ డేస్’ అనే ఆల్బమ్‌తోనే యూత్‌కు బాగా దగ్గరయ్యాడు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్.
ఏది మారినా ఫ్రెండ్ మారడే..
చిన్నప్పుడు స్కూల్‌లో పరిచమయిన ఫ్రెండ్స్‌తోనే జీవితాంతం ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్లు కూడా ఉంటారు. అలా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా ఫ్రెండ్‌షిప్ మాత్రం మారదు అని చెప్పడానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలోని ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే పాటే నిదర్శనం. చాలా క్యాచీ లిరిక్స్‌తో యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ పాటను కంపోజ్ చేసి, పాడాడు దేవీ శ్రీ ప్రసాద్.
దోస్త్ మేరా దోస్త్..
జగపతి బాబు హీరోగా నటించిన ‘పెళ్లి పందిరి’ సినిమా మొత్తం ఫ్రెండ్‌షిప్‌పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సినిమాలో ఫ్రెండ్‌షిప్‌పై రెండు పాటలు ఉన్నాయి. అందులో ఒకటి ‘నేస్తమా ఇద్దరి లోకం ఒకటే’ అయితే.. మరొకటి ‘దోస్త్ మేరా దోస్త్’. ఇందులోని దోస్త్ మేరా దోస్త్ పాటను ఇప్పటికీ స్నేహితులు సరదాగా పాడుకుంటూ ఉంటారు. ఇలా తెలుగులో మరెన్నో పాటలు ఫ్రెండ్‌షిప్ గురించి అద్భుతంగా వివరిస్తాయి.
Also Read: హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే - స్నేహం విలువ చెప్పే టాలీవుడ్ సినిమాలు, మీ ఫ్రెండ్స్‌తో కలిసి చూడండి