Bootcut Balaraju OTT Release Date: బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్.. ఆ రియాలిటీ షో నుండి బయటికి వచ్చిన తర్వాత హీరో అవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఒకట్రెండ్ చిత్రాల్లో హీరోగా నటించి అలరించాడు కూడా. ఇక తాజాగా తను లీడ్ రోల్ చేసిన ‘బూట్‌కట్ బాలరాజు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలయిన మొదటిరోజే సినిమాకు తగినంత ఆదరణ లభించకపోవడంతో సోహెల్ ఎమోషనల్ అయ్యాడు. దయచేసి ‘బూట్‌కట్ బాలరాజు’ చూడమని ప్రేక్షకులను వేడుకున్నాడు. ఆ తర్వాత మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే మూవీ ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యింది.
రెడీగా ఉండండి..
సోహెల్ హీరోగా నటించిన ‘బూట్‌కట్ బాలరాజు’ ఓటీటీ రైట్స్‌ను ఆహా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ‘వచ్చేత్తనాడు, వచ్చేత్తనాడు. మన 'బూట్ కట్ బాలరాజు'. ఇక ఊరు, వాడ, పిల్లా, జల్లా అందరూ రెడీగా ఉండుర్రి’ అంటూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది ఆహా. ఫిబ్రవరీ 26న ఆహాలో ‘బూట్‌కట్ బాలరాజు’ స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది. మామూలుగా ఏ సినిమా అయినా అర్థరాత్రి 12 గంటల నుండి స్ట్రీమ్ అవ్వగా ఈ మూవీల మాత్రం సాయంత్రం 6 గంటల నుండే స్ట్రీమ్ అవ్వనున్నట్టు ఆహా ప్రకటించింది. థియేటర్లలో కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘బూట్‌కట్ బాలరాజు’ ఓటీటీలో ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా..
ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించాడు సయ్యద్ సోహెల్. ఫ్యామిలీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన దాదాపు ప్రతీ సినిమాలో సోహెల్‌కు ఒక చిన్న పాత్ర ఉంటుంది. అలా మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారాడు. హీరోగా మారిన తర్వాత తనకు అవకాశాలు వచ్చినా కూడా అదృష్టం మాత్రం కలిసి రాలేదు. కానీ బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల మాత్రం తనకు విపరీతమైన పాపులారిటీ లభించింది. దీంతో ఆ క్రేజ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది అనే ఉద్దేశ్యంతో హీరోగా తన దగ్గరకు వచ్చిన అవకాశాలను ఒప్పుకుంటూ వెళ్లిపోయాడు సోహెల్. కానీ బుల్లితెరపై తనను ఆదరించిన ప్రేక్షకులు.. తన సినిమాలు చూడడానికి థియేటర్లకు మాత్రం రాలేదు. ఈ విషయంపై పబ్లిక్‌గా కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు.
అందరి ముందు ఎమోషనల్..
థియేటర్లలో ‘బూట్‌కట్ బాలరాజు’ విడుదల అవ్వగానే మొదటిరోజు రెస్పాన్స్ చూసి మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టాడు సోహెల్. “ఈ సినిమా ఫ్రెండ్స్‌తో మాత్రమే కాదు, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఈ మూవీలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. క్యూట్‌గా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమలో అందరూ చూడండి. హైదరాబాద్ లో మంచి రెస్పాన్స్ ఉంది. కానీ, కొన్ని ఏరియాల్లో సినిమా చూసేందుకు థియేటర్లకు ఎవరూ రావడం లేదు. ప్రేక్షకులు రాక షోలు క్యాన్సిల్ కావడం బాధ కలిగిస్తోంది’’ అంటూ సోహెల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన కొందరు ప్రేక్షకులు తనను హీరోగా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశ్యంతో థియేటర్లకు వెళ్లారు. దీంతో మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది.
Also Read: పెళ్లికి సిద్ధమైన ‘బంగారం’ బ్యూటీ - వెడ్డింగ్ డేట్ ఫిక్స్, ఎప్పుడు.. ఎక్కడంటే?