Devil Collections: డిసెంబర్‌లో ఎన్నో తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో చాలావరకు సూపర్ హిట్‌గానే నిలిచాయి. ఇక ఇయర్ ఎండింగ్ వీకెండ్‌లో థియేటర్లలో సందడి చేయడానికి ‘డెవిల్’ వచ్చింది. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకులు మిక్స్‌డ్ టాక్ ఇస్తున్నారు. ‘బింబిసార’లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మళ్లీ హిట్ కొడదామని ‘డెవిల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్. అయితే ఆ ప్రయోగం పూర్తిగా సక్సెస్ అవ్వలేదు. వసూళ్ల విషయంలో సినిమా ఇంకా వెనకబడే ఉందని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు. 


ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దూకుడు..
‘డెవిల్’ మూవీ విడుదల ముందు మేకర్స్ అంతా చురుగ్గా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. బ్రిటిష్ కాలంలో ఒక స్పైకు సంబంధించిన కథ అని, విజువల్ వండర్ అని ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశారు. దీంతో ప్రీ బుకింగ్స్ విషయంలో ‘డెవిల్’ దూకుడు చూపించింది. నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో దాదాపు రూ. 8 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మొత్తంగా రూ.16.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది ‘డెవిల్’. తెలుగు రాష్ట్రాల మినహా ఇతర రాష్ట్రాల్లో రూ.1.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. ఓవర్సీస్‌లో రూ.2 కోట్ల బిజినెస్ జరిగింది. అలా మొత్తంగా ‘డెవిల్’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.20.10 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది.


‘డెవిల్’ డిజాస్టర్?
న్యూ ఇయర్ ముందు వీకెండ్ కావడంతో చాలామంది ప్రేక్షకులు.. ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలను ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ సరిగ్గా 2023 చివరి వారంలోనే విడుదలయిన తెలుగు సినిమాలు ఏమీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో చాలామంది మంచి టాక్ వచ్చిన ‘సలార్’ మూవీకి వెళ్లడానికే ఆసక్తి చూపించారు. అలా ‘డెవిల్’ కలెక్షన్స్‌కు గండిపడింది. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కేవలం రూ.1 కోటి కలెక్షన్స్‌ను మాత్రమే రాబట్టిందని సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.1.30 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసిందని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే ‘డెవిల్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.


‘బింబిసార’లాగా అవుతుందనుకుంటే..
హీరోగా కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి కళ్యాణ్ రామ్ వరుస డిసాస్టర్లను చూశాడు. కానీ ‘బింబిసార’ మాత్రమే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రొటీన్ కమర్షియల్ సినిమాలను నమ్ముకోవడం కరెక్ట్ కాదని, భిన్నంగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని కళ్యాణ్ రామ్ అప్పుడే డిసైడ్ అయిపోయినట్టున్నాడు. అందుకే తన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో రూటు మార్చాడు. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ‘డెవిల్’ కూడా అలాగే హిట్ అవుతుందని అనుకున్నాడు కానీ తన ఆశలు నెరవేరలేదు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్‌కు జంటగా సంయుక్త మీనన్ కనిపించగా.. మాళవిక నాయర్, అజయ్, సత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ నామా.. ఈ మూవీకి డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు.


Also Read: అలా అనిపించకుండా చేస్తాం అన్నారు - ‘యానిమల్’లో ఇంటిమేట్ సీన్ ఎక్స్‌పీరియన్స్ బయటపెట్టిన తృప్తి