Kalki 2898 AD 2Days Gross Collections: ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శత్వంలో, ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కల్కీ 2898 ఏడీ'. జూన్ 27న విడుదల అయిన ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్ల రాబడుతోంది. కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. సినిమాకి హిట్ టాక్ రావడంతో ప్రజలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు సూపర్ గా ఉన్నాయి అంటూ వైజయంతి మూవీస్ ఇన్ స్టాలో ట్వీట్ చేసింది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్ సాధించింది? ఒకసారి చూద్దాం.
గ్రాస్ కలెక్షన్ ఎంతంటే?
'కల్కీ 2898 ఏడీ' సినిమా వారం మధ్యలో రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు భారీగానే వచ్చారు. దీంతో మొదటి రోజు గ్రాస్ కలెక్షన్లు రూ.191.5 కోట్లు దాటింది. ఇక ఇప్పుడు ఈ సినిమా గ్రాస్ కలెక్షన్లు రూ.298.5 కోట్లు దాటిన్లు సినిమా టీమ్ ప్రకటించింది. "ప్రపంచం నలుమూలల నుంచి మీ ప్రేమను కురిపిస్తున్నారు" అంటూ అమితాబ్ బచ్చన్ నడుస్తున్న ఒక పోస్టర్ ని షేర్ చేసింది వైజయంతి మూవీస్ టీమ్. ఇదిలా ఉంటే.. శనివారం, ఆదివారం వీకెండ్ కావడంతో కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కచ్చితంగా వెయ్యి కోట్ల కబ్ల్ లో చేరుతుంది రాసిపెట్టుకోండి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు.
రికార్డులపై స్వప్న దత్ కామెంట్..
ఇదిలా ఉంటే.. 'కల్కీ' సినిమా రికార్డులపై ఆ సినిమా ప్రొడ్యూసర్లలో ఒకరైన స్వప్న దత్ కామెంట్ చేశారు. అందరూ తనని రికార్డుల గురించి ఫోన్లు చేసి అడుగుతున్నారని, తాము రికార్డుల కోసం సినిమా తియ్యలేదని, అలా అడుగుతుంటే నవ్వొస్తుంది అంటూ కామెంట్ చేశారు ఆమె. ఇప్పటి వరకు రికార్డులు సృష్టించిన వారు ఎవ్వరూ రికార్డులు కోసం సినిమాలు తియ్యలేదని, సినిమా మీద ప్రేమతోనే తీశారని అన్నారు. తాము కూడా అంతే అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ప్రముఖుల ప్రశంసలు..
'కల్కీ 2898 ఏడీ' సినిమాపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉంది అంటూ ఎక్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, డైరెక్టర్ ఆర్జీవి, విజయ దేవరకొండ, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు నాగ్ అశ్విన్ ని పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ వాడిన బుజ్జిని చూసేందుకు సెలబ్రిటీలు ఆసక్తిని చూపిస్తున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహలత, నాగ్ అశ్విన్ తదిలరులు బుజ్జితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నారు.
సెకెండ్ పార్ట్ కోసం..
ఇప్పుడు ఎవరు చూసినా 'కల్కీ' సినిమా సెకెండ్ పార్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. సెకెండ్ పార్ట్ దీన్ని మించి ఉంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ పార్ట్ లో కమల్ హాసన్ కేవలం రెండుసార్లు మాత్రమే కనిపిస్తారు. దీంతో ఆయన పాత్ర సెకెండ్ పార్ట్ లో అద్భుతంగా ఉండబోతుంది అంటూ అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాకుండా విజయ దేవరకొండకి కూడా సెకండ్ పార్ట్ లో అర్జునుడిగా ఎక్కువసేపు కనిపించే ఛాన్స్ ఉంటుందేమో అనే వార్త కూడా వినిపిస్తుంది. చూడాలి మరి సెకెండ్ పార్ట్ ని ఇంకా ఏ రేంజ్ లో తీర్చిదిద్దుతారో.
Also Read: 'కల్కీ 2898 AD'పై రజనీకాంత్ ప్రశంసలు - సూపర్ స్టార్ ఏమన్నారంటే?