Actress Hema About Karate Kalyani: ప్రస్తుతం బెంగుళూరు రేవ్ పార్టీకి సంబంధించిన ప్రతీ ఒక్క అప్డేట్, ప్రతీ ఒక్క రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన హేమ.. బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లిందని, అక్కడ డ్రగ్స్ తీసుకుందని పోలీసులు కన్ఫర్మ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హేమపై కొందరు సినీ సెలబ్రిటీలు విమర్శలు కురిపిస్తున్నారు. అందులో అందరికంటే ముందుగా కరాటే కళ్యాణి.. హేమ విషయంలో స్పందించింది. అయితే అసలు కరాటే కళ్యాణికి, తనకు మధ్య గొడవలు ఎందుకు అని హేమ ఒక పాత ఇంటర్వ్యూలో బయటపెట్టింది.


మమ్మల్ని లాగొద్దు..


‘‘అప్పట్లో కొంతమంది హీరోయిన్ల ఫోటోలను మార్ఫ్ చేశారు. కొందరు పాత మలయాళ సినిమాల్లోని అసహ్యమైన క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొని, వాటికి థంబ్‌నెయిల్స్ పెట్టారు. అప్పుడు నేను అందరితో గొడవపడి నేనే ఆ ఫోటోలు అన్నీ తీయించాను. నేను మా అసోసియేషన్‌లో జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇదంతా జరిగింది. ఆ సమయంలో నేను నరేశ్, కరాటే కళ్యాణిని సపోర్ట్ అడిగాను. మీడియా, వెబ్‌సైట్స్‌తో పెట్టుకోము అని, అలాంటి వాటిలో మమ్మల్ని లాగొద్దు అని నరేశ్ అన్నారు. మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో ఆడవాళ్ల కోసం రమ్మనప్పుడు నరేశ్ ఇలా అన్నారని గుర్తుచేశాను. దీంతో వాళ్లు నా మీద రివర్స్ అయ్యారు. నేను పిచ్చి డ్రెస్సులు వేసుకున్నాను అని నరేశ్ ఏదేదో అన్నారు’’ అని అప్పటి గొడవ గురించి బయటపెట్టింది హేమ.


గ్రూప్‌లో ఫోటో..


‘‘ఒకసారి నా బ్యానర్‌లో సినిమా చేస్తున్నప్పుడు నా డైరెక్టర్‌కు కొందరు అమ్మాయిల ఫోటోలు పంపిస్తుంటే అందులో ఒక ఫోటో మిస్ అయ్యి వాట్సాప్ గ్రూప్‌లో వచ్చింది. అక్కడ పొరపాటు జరిగింది. నేను పంపిన ఫోటోలో ఉన్నది ఒక మంచి ఆర్టిస్ట్, హీరోయిన్. దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరికో హాయ్ అని పంపించబోయి మరొకరికి పంపిస్తే అది తప్పు ఎలా అవుతుంది? అప్పుడు నాకు వాళ్లు చేసింది నచ్చక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నరేశ్, కరాటే కళ్యాణి మీద కంప్లైంట్ ఇచ్చాను. నువ్వు మగాడివి అయితే నీ దగ్గర ఏమేం ప్రూవ్స్ ఉన్నాయో తీసుకొచ్చి ఇవ్వు అన్నాను’’ అని చెప్పుకొచ్చింది హేమ.


పేకాట కేసులో పట్టుబడింది..


‘‘నాకు ఓట్లు వేయొద్దు అని హేమ చెప్పింది, అలా ఎలా చెప్తుంది అని కరాటే కళ్యాణి అందరితో చెప్పుకుంది. ఆ విషయం నేను కూడా ఒప్పుకున్నాను. అసలు వాళ్ల ప్యానెల్‌కే ఓట్లు వేయకుండా మా ప్యానెల్‌కు వేయమని అడిగాను. అది నా హక్కు. దానికి తనకు కోపం వచ్చింది. ఏం మాట్లాడాల్సి ఉన్నా స్టేషన్‌కు వచ్చి మాట్లాడు అన్నాను. ఆమె పేకాట కేసులో పట్టుబడింది.. నేను కాదు. నరేశ్, కరాటే కళ్యాణి కలిసి సోషల్ మీడియాలో నా గురించి అసభ్యంగా పెట్టారు. అప్పుడు నా డిఫెన్స్‌లో నేను మాట్లాడాను. ఇప్పటివరకు నా అంతట నేను ఏ ఆడపిల్ల గురించి కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు. వాళ్లు నన్ను ఏమన్నా కూడా నేను వాళ్లను అనను’’ అని అసలు వాళ్లతో తనకు జరిగిన గొడవ ఏంటో క్లారిటీ ఇచ్చింది హేమ.


Also Read: అందుకే ‘మా’ ఎన్నికలు జరగలేదు, సీఎంకు విన్నవించుకున్నాం: కరాటే కళ్యాణి