పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కోసమే అన్నట్టుగా మేకర్స్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా త్వరలోనే ఈ మూవీ సెట్లో చేరబోతున్నారు అనేది తాజా సమాచారం.
'హరిహర వీరమల్లు' షూటింగ్ రీస్టార్ట్
డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఇందులో పవన్ సామ్రాజ్యవాదులకు చుక్కలు చూపిస్తూ, స్వాతంత్య్రం కోసం పోరాడే యోధుడుగా కనిపించనున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరపైకి తీసుకురాబోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్, బాబి డియోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను 'హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడో మొదలైన ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజులు డేట్స్ ఇస్తే చాలు మూవీని పూర్తి చేస్తామని ఎదురు చూస్తున్నారు నిర్మాతలు. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే.
గత ఏడాది డేట్స్ ఇచ్చినప్పటికీ మూవీ షూటింగ్ పూర్తికాలేదు. దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేది ఎప్పుడు? షూటింగ్ పూర్తయ్యేది ఎప్పుడు? అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఆ అనుమానాలు అన్నిటికి ఫుల్ స్టాప్ పడేలా తాజాగా మూవీ షూటింగ్ పై అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం సత్యరాజ్, ఈశ్వరి రావులపై మేకర్స్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గండికోటలో శనివారం 'హరిహర వీరమల్లు' చిత్ర బృందం సందడి చేసిన ఫోటోలు బయటకొచ్చాయి. మాధవరాయ స్వామి దేవాలయంలో శివాలయం సెట్టింగ్ వేసి, పురోహితుడుగా సీనియర్ నటుడు సత్యరాజ్ పై కొన్ని సీన్స్ ను షూట్ చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం నాలుగు రోజులు కేటాయిస్తే చాలు షూటింగ్ పూర్తవుతుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత పవన్ సెట్లో జాయిన్ కాబోతున్నారు. దీంతో నిర్మాతలు మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసి, థియేటర్లోకి తీసుకొచ్చే సన్నాహాల్లో మునిగిపోతారు.
అనుకున్న టైమ్ కు మూవీ రిలీజ్ అవుతుందా ?
ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలైన సంగతి తెలిసిందే. 'మాట వినాలి' సాంగ్ తో పాటు వాలెంటైన్స్ డే కానుకగా 'కొల్లగొట్టినాదిరో' అనే రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కానీ మూవీ ముందుగా అనౌన్స్ చేసినట్టుగా మార్చి 28న రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని టాక్ నడుస్తుంది. మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ సినిమాలు అదే డేట్ కు రిలీజ్ అవుతుండడమే అందుకు కారణం.
Also Read: సింగర్ కల్పన కెరీర్‌లో బెస్ట్ తెలుగు సాంగ్స్... 1500 పాటల్లో, తెలుగులో టాప్ 10 లిస్ట్ ఇదిగో