HanuMan First Weekend Collections: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీకి దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఫిదా అయిపోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లే, యాక్టింగ్.. ఇలా అన్ని విషయాల్లో ఈ మూవీ ప్రేక్షకులను తెగ మెప్పించేస్తోంది. అందుకే కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో సాధిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యి ఒక వీకెండ్ అయిపోయింది. ఇక ‘హనుమాన్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తుంటే.. ఇవి ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘కాంతార’ చిత్రాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రికార్డులను కూడా బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఎవరైతే ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వడం కరెక్ట్ కాదని ట్రోల్ చేశారో.. వారే దీనిని ప్రశంసిస్తున్నారు.


మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..?


జనవరి 12న ‘హనుమాన్’ మూవీ విడుదలకు సిద్ధమయినప్పుడు అదే మూవీకి పోటీగా ‘గుంటూరు కారం’ కూడా బరిలో ఉంది. అలాంటి పెద్ద సినిమాకు పోటీగా ‘హనుమాన్’ను విడుదల చేయడం కరెక్ట్ కాదని ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాలకు చాలామంది సలహా ఇచ్చారు. కానీ వారి కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో అదే రోజు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మేకర్స్ నమ్మినట్టుగానే ‘గుంటూరు కారం’కంటే ‘హనుమాన్’కే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక పాన్ ఇండియా వైడ్‌గా మూవీ రిలీజ్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్ రన్ ముగించుకున్న ‘హనుమాన్’ రూ.40.65 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది.


ప్రతీ వెర్షన్‌లో అదిరిపోయే కలెక్షన్స్..


‘హనుమాన్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘కాంతార’కంటే ఎక్కువ అని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. మరో 10 రోజులు ఇలాగే ‘హనుమాన్’ రన్ కొనసాగితే.. ‘పుష్ప ది రైజ్’ రికార్డులను కూడా టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ డే ‘హనుమాన్’కు కేవలం రూ. 8 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్‌పై పాజిటివ్ ఎఫెక్ట్ పడింది. సండే రోజు రూ.16 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది ఈ మూవీ. ఇప్పటివరకు ‘హనుమాన్’ తెలుగు వర్షన్ రూ.28.21 కోట్లు, హిందీ వెర్షన్ రూ.12 కోట్లు, తమిళ, కన్నడ వెర్షన్స్ కలిపి రూ.19 లక్షలు, మలయాళంలో రూ.6 లక్షల కలెక్షన్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఒక ఫిల్మ్ ట్రేడ్ అనాలిస్ట్ ట్వీట్ చేశారు. 


హిందీ వెర్షన్ కలెక్షన్స్ అదుర్స్..


ప్రస్తుతం ‘హనుమాన్’ హిందీ వెర్షన్‌కు వస్తున్న కలెక్షన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక్క హిందీలోనే రూ.12.26 కోట్లు రావడం, ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘కాంతార’లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ను బీట్ చేయడం అంత ఈజీ కాదని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికీ ‘హనుమాన్’కు పోటీగా సంక్రాంతికి విడుదలయిన ఇతర తెలుగు సినిమాలు నిలబడలేకపోయాయి. అందుకే ఇప్పట్లో ‘హనుమాన్’ కలెక్షన్స్‌ను గండిపడే అవకాశం లేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. త్వరలో విడుదల కానున్న సినిమాల్లో హృతిక్ రోషన్, దీపికా పదుకొనె కలిసి నటించిన ‘ఫైటర్’ మాత్రం.. ‘హనుమాన్’ కలెక్షన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Also Read: ఇక్కడ హనుమాన్, అక్కడ ‘అయాలన్’ - ధనుష్ మూవీకి ఊహించని షాకిచ్చిన ఏలియన్