GV Prakash Reacts On Trolls: ప్రముఖ సంగీత దర్శకుడు,నటుడు జీవీ ప్రకాష్‌ ఇటీవల తన భార్య సైంధవితో విడిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే తాము విడిపోతున్నామంటూ జీవీ, సైంధవ్‌లో అధికారికంగా ప్రకటించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్స్‌ చేస్తూ పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకుని పదకొండేళ్లు అన్యోన్యంగా జీవించిన వీరి ఇలా విడిపోవడానికి వారి సన్నిహితులు, ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ విడాకులు ప్రకటన అనంతరం నెటిజన్లు జీవీ ప్రకాష్‌ను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.


ఇన్నేళ్ల తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అలా వదిలేయడం ఏంటని, మరో మహిళలతో సంబంధం ఉందా? అంటూ జీవీ క్యారెక్టర్‌పై రకరకాలుగా పలు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు అతడి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా నెటిజన్లు సోషల్‌ మీడియోలో జీవీని ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో అతడిపై వస్తున్న ట్రోల్స్‌ కాస్తా జీవీ కంటపడ్డాయి. దీనిపై అతడు స్పందిస్తూ షాకింగ్‌ పోస్ట్‌ చేశారు. తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తన వ్యక్తిత్వంపై చేసిన కామెంట్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఈ మేరకు తమిళంలో పోస్ట్‌ చేస్తూ.. "విడిపోయిన ఇద్దరు వ్యక్తుల గురించి పూర్తిగా తెలియకుండ డిబెట్‌లు పెట్టడం సరికాదు.






సెలబ్రిటీలు అనే కారణంతో వారి వ్యక్తిగత జీవితాలపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేయడం తగదు. మేమిద్దరం విడిపోవడానికి  జీవితాలపై డిబెట్‌ పెట్టడం ఎంతవరకు కరెక్ట్‌. సెలబ్రిటీలు అనే పేరుతో వారి వ్యక్తిగత జీవితంలోకి దూరి దిగజారి విమర్శలు చేయడమనేది అమోదయోగ్యం కాదు. ఇవి ఆ ఇద్దరి వ్యక్తుల జీవితంపై ప్రభావం చూపుతుందని గ్రహించలేని తమిళుల గౌరవం తగ్గిపోయిందా? దయచేసి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వ్యక్తి గౌరవాన్ని, ఎమోషన్స్‌ గౌరవించండి" అంటూ ట్రోలర్స్‌కి చురకలు అట్టించాడు. ప్రస్తుతం జీవీ ప్రకాష్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. అతడి పోస్ట్‌కు కోలీవుడ్‌ ఇండస్ట్రీ ప్రముఖులు,నటీనటులు మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. 


Also Read: ఆ డబ్బులు అడిగింది నేనే, కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు - రూ. 3వేలు పంపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌


అలాగే "మా ఈ నిర్ణయం సడెన్‌గా తీసుకుంది కాదు. దీనిపై ఎంతో ఆలోచిన తర్వాత ముందుకు వెళ్లాం. మా విడాకులు నిర్ణయాన్ని మా కుటుంబసభ్యులకు వివరించాం. మా స్నేహితుకులకు కూడా స్పష్టత ఇచ్చాం. అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మేం వెంటనే తీసుకన్న నిర్ణయం మాత్రం కాదనేది నిజం. కానీ ఇది తెలియకుండ ఎవరూ తొచినట్టు వారు ఊహించుకుంటున్నారు. దాన్ని నిజమంటూ డిబెట్లు పెడుతున్నారు. ఇది అసలు సరైనది కాదు. ఆ కామెంట్స్ నన్ను ఎంతగా బాధించాయే చెప్పేందుకే నేను ఈ పోస్ట్‌ చేస్తున్నాను" అని పేర్కొన్నాడు.