DeAr Official Trailer Out: గురక సమస్యను బేస్ చేసుకుని రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గుడ్ నైట్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చక్కటి విజయాన్ని అందుకుంది. మణికందన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఆయనకు ఉన్న గురక సమస్య కారణంగా తన భార్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది? చివరకు ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. తాజాగా అలాంటి సినిమానే మరొకటి ప్రేక్షకులను అలరించబోతోంది. జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలలో ‘డియర్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృదం ట్రైలర్ ను విడుదల చేసింది.  


భార్య గురకతో భర్తకు అవస్థలు


దాదాపు రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ‘డియర్’ ట్రైలర్‌లో హీరో జీవీ ప్రకాష్ న్యూస్ రీడర్‌గా కనిపించాడు. రోహిణి ఆయనకు తల్లిగా నటిస్తుండగా, కాళీ వెంకట్ సోదరుడిగా నటించారు. ఐశ్వర్య రాజేష్‌తో జీవీ ప్రకాష్ కు పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల సమక్షంలో సంప్రదాయం ప్రకారం ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. అయితే, ఐశ్వర్యకు గురక సమస్య ఉండటంతో వారి వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. భార్య గురకతో భర్త రోజు రోజుకు మరింత ఇబ్బంది పడుతారు. చివరకు ఈ గురక పంచాయితీ ఎక్కడి వరకు వెళ్లింది? అనేది సినిమాలో చూపించనున్నారు. ఈ ట్రైలర్ ఫన్నీగా మొదలై సీరియస్ అంశాలను టచ్ చేస్తూ ఎండ్ అవుతుంది.



తెలుగు ట్రైలర్‌కు నాగ చైతన్య వాయిస్..


తమిళ ట్రైలర్‌కు క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తెలుగు కోసం అక్కినేని అక్కినేని నాగ చైతన్య గళం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘భలే వెడ్డింగ్’ అనే పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బాగా అలరించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ ను అన్నపూర్ణ స్టూడియోస్ కొనుగోలు చేసింది. తెలంగాణ థియేట్రికల్ రైట్స్‌ను ఏషియన్ సినిమాస్ దక్కించుకుంది. ఈ సినిమాలో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Read Also: అవును ప్రేమిస్తున్నా- విజయ్ దేవరకొండతో లవ్ గురించి అసలు విషయం చెప్పేసిన రష్మిక మందన్న