Dear Telugu Trailer With Naga Chaitanya VoiceOver: ఈ మధ్య భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు డబ్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో తమిళ్, మలయాళ చిత్రాలకు రోజురోజుకు ఆదరణ పెరిగిపోతుంది. తమిళంలో, మలయాళంలోని చిత్రాలు తెలుగులోనూ డబ్ అవుతున్నాయి. కొని నేరుగా రిలీజ్ అవుతుండగా.. మరికొన్ని అక్కడ హిట్ అవ్వగానే ఇక్కడ డబ్ అవుతున్నాయి. ఇక రీసెంట్‌గా ఓటీటీలో గుడ్‌నైట్ పేరుతో ఓ తమిళ్ సినిమా వచ్చంది. గురక సమస్యలో నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ డ్రామాతో వస్తున్న చిత్రం 'డియర్'. ఐశ్వర్య రాజేశ్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళ్, తెలుగులో ఏకకాలం తెరకెక్కింది.
ట్రైలర్ ఎలా ఉందంటే..
ఏప్రిల్ 11న తమిళ్, ఏప్రిల్12న తెలుగులో ఈ చిత్రం రెండు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా నేడు తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇన్ని తమిళంలో రిలీజైన ట్రైలర్ మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ తెలుగు ట్రైలర్ యంగ్ హీరో నాగ చైతన్య చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. అంతేకాదు ఈ ట్రైలర్ నాగ చైతన్య వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం. చై వాయిస్ ఓవర్‌తో సాగిన ఈ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుంది. కామెడీ, ఫ్యామిలీ డ్రామా వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, జీవీ ప్రకాష్‌లు భార్యభర్తలుగా నటించారు. భార్య గురక వల్ల ఇబ్బంది పడే భర్త ఏం చేశాడు, ఆ సమస్య వారి వైవాహిక జీవితంలో తీసుకున్న మనస్పర్థల నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని అర్థమైంది. ఇక చై వాయిస్ ఓవర్‌తో సాగిన ఈ ట్రైలర్ ఆద్యాంతం ఆకట్టుకుంది. కామెడీతో, కూల్‌గా మొదలై ఈ ట్రైలర్ చివరికి సీరియస్ అంశాలతో ముగుస్తుంది. ఇక ఇందులోని పాత్రలన్నిటికి కూడా ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో తెలుగు 'డియర్'
ఇక చిన్న గురకను భరించలేకపోతున్నావ్ ఏంట్రా.. జీవీ ప్రకాశ్ తల్లి పాత్ర రోహిణి చెప్పే డైలాగ్.. అసలే లైట్ స్లీప్ ఉన్న భర్త, భార్య గురక వల్ల నిద్రపట్టలేక పడే ఇబ్బందిని ఈ ట్రైలర్ బాగా చూపించారు. ఈ ట్రైలర్ మూవీ అంచనాలు పెంచుతుంది. మరి రిలీజ్ తర్వాత థియేటర్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకు స్వయంగా జీవీ ప్రకాశే సంగీతం అందించడం విశేషం. ఆయన కంపోజ్ చేసిన పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్‌ని అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ దక్కించుకున్నాయి. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సొంతంగా చేసుకోగా.. తెలంగాణలో రైట్స్ ఏషియన్ సినిమాస్ తీసుకుంది. ఈ సినిమాలో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలు పోషిస్తున్నారు.