Euphoria Movie Title Announcement: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణ శేఖర్. వైవిధ్యభరిత కథనాలతో భారీ ప్రాజెక్టులను రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. టాలీవుడ్ స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న గుణ శేఖర్, పౌరాణికం, జానపదం ఏదైనా అద్భుతంగా తెరకెక్కింగల సత్తా ఉన్న దర్శకుడు. గత కొంతకాలంగా ఆయన అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. అయినప్పటికీ, తన ప్రయత్నాలను విరమించడం లేదు. చాలా కాలంగా ఆయన సొంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లోనే సినిమాలు చేస్తున్నారు.


చాలా గ్యాప్ తర్వాత కొత్త సినిమా ప్రకటించిన గుణ శేఖర్


‘శాకుంతలం’ సినిమా తర్వాత గుణ శేఖర్ కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తారా? అని చాలా మంది సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆయన కొత్త సినిమాకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మాతగా ఈ కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమాకు 'యుఫోరియా’ అని పెట్టారు. వీలైనంత త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. త్వరలోనే టెక్నికల్ టీమ్ కు సంబంధించిన డీటైల్స్ వెల్లడిస్తామన్నారు. అంతకు మించి ఈ మూవీకి సంబంధించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఈ సినిమా కథాంశం ఏంటి? ఎవరు నటీనటులుగా ఉంటారు? అనే విషయంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది.






హిస్టారికల్ సినిమాలకు పెట్టింది పేరు


గుణ శేఖర్ తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుత సినిమాలు తెరకెక్కించారు. హిస్టారికల్ సినిమాల విషయంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. చివరగా గుణ శేఖర్ తన సొంత బ్యానర్ లో 'శాకుంతలం' అనే సినిమా చేశారు. సమంత ప్రధానపాత్రలో నటించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని అందరూ భావించారు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లు సాధించలేక, డిజాస్టర్ గా మిగిలింది. ఎక్కువ డబ్బు వెచ్చించి తీసిన ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో గుణ శేఖర్ కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు.  కొత్త సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నారు. 'యుఫోరియా’ మూవీతో మరోసారి తన సత్తాను నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు.


Read Also: మాసిన గడ్డం, నోట్లో సిగరెట్ - అల్లరి నరేష్ ‘బ‌చ్చల మ‌ల్లి’ ఫస్ట్ లుక్ అదుర్స్ అంతే!