Upcoming Movies In Telugu: మార్చి(2024) రెండో వారంలో పలు సినిమాలు థియేటర్లలో అలరించనున్నాయి. శుక్రవారం నాడు శివరాత్రి కావడంతో బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాల సందడి నెలకోనుంది. సరికొత్త కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు మూవీ లవర్స్ ను ఆకట్టుకోనున్నాయి. ఇంతకీ ఈ వారం థియేటర్లలోకి అడుగు పెట్టే సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. ‘భీమా’
టాలీవుడ్ మాస్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘భీమా’. మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో గోపీచంద్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 8న విడుదలకు రెడీ అవుతోంది.
2. ‘గామి’
టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన అడ్వెంచర్ మూవీ ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. హిమాలయాల్లో ఓ అఘోర చేసే సాహసోపేతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో విశ్వక్ ఆఘోరా శంకర్ గా కనిపించనున్నారు. ఈ మూవీ శివరాత్రి కానుకగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
3. ‘ప్రేమలు’
మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన ‘ప్రేమలు’ సినిమా తెలుగులోకి రాబోతోంది. కేవలం రూ.3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 85 కోట్లు వసూళు చేసింది. నస్లెన్ గఫూర్, మాథ్యూ థామస్, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో గిరీశ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో రాజమౌళి కొడుకు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
4. ‘రికార్డ్ బ్రేక్’
చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తాజాగా చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.
5. ‘వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’
రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’. అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.
6. ’నాయుడు గారి అబ్బాయి ప్రేమలో రాజుగారి అమ్మాయి’
సత్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ’నాయుడు గారి అబ్బాయి ప్రేమలో రాజుగారి అమ్మాయి’. రవితేజ నున్న, నేహా జురెల్ హీరో హీరోయిన్లుగా నటించారు. కామెడీ, లవ్, థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
7. ‘సైతాన్’
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ స్టార్ యాక్టర్ మాధవన్, సీనియర్ నటి జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘సైతాన్’. ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Read Also: మహేష్ బాబు నా క్లాస్ మేట్, బెంచీలు ఎక్కి దూకుతూ అల్లరి చేసేవాళ్లం - కోలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్