Just In





Good Bad Ugly Twitter Review - 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్విట్టర్ రివ్యూ: అజిత్ హిట్టు కొట్టాడా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Good Bad Ugly Review In Telugu: అజిత్ కుమార్, త్రిష జంటగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. మరి, సినిమా టాక్ ఎలా ఉందో చూడండి.

Ajith Kumar's Good Bad Ugly Movie Telugu Review: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హిట్టు కొట్టి ఆల్మోస్ట్ ఆరేళ్లు అవుతోంది. 'పింక్' తమిళ్ రీమేక్ 'నెర్కొండ పార్వాయ్' తర్వాత ఆయన ఖాతాలో సాలిడ్ హిట్ పడలేదు. గతేడాది వచ్చిన 'తునివు', ఈ ఏడాది 'విడా ముయర్చి' అభిమానులను కూడా డిజప్పాయింట్ చేశాయి. ఆ లోటు 'గుడ్ బాడ్ అగ్లీ' తీర్చేలా ఉందని సోషల్ మీడియాలో ప్రీమియర్ షో టాక్ చూస్తే అర్థమవుతోంది.
ది బెస్ట్ టైటిల్ కార్ట్...
అజిత్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
విశాల్, ఎస్.జె. సూర్యల 'మార్క్ ఆంటోనీ' హిట్ తర్వాత దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తీసిన సినిమా 'గుడ్ బాడ్ అగ్లీ'. ట్రైలర్లతో సినిమా జోనర్ ఏమిటనేది చెప్పేశాడు. అభిమానులకు కావాల్సిన స్టఫ్ ఉంటుందని హింట్ ఇచ్చాడు. అది టైటిల్ కార్డ్స్ నుంచి మొదలు అయ్యిందట. అజిత్ కెరియర్ మొత్తం మీద ది బెస్ట్ టైటిల్ కార్డ్ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
ఫస్ట్ హాఫ్ టు ఇంటర్వెల్...
విజిల్ వర్తీ మూమెంట్స్ గురూ!
టైటిల్ కార్డ్స్ మొదలైనప్పటి నుంచి 20 నిమిషాల వరకు అజిత్ ఫ్యాన్స్ థియేటర్లలో విజిల్స్ వేస్తూ ఉంటారని ట్విట్టర్ లో చాలా మంది పోస్టులు చేశారు. గ్యాంబ్లర్ తర్వాత ఆ స్థాయిలో హీరో ఇంట్రడక్షన్ సెట్ అయ్యిందని అంటున్నారు. హీరో ఎంటర్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు అభిమానులకు కావాల్సిన అంశాలతో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ సినిమా చేశారట.
యాక్షన్ బ్లాక్స్ అన్ని బాగా వచ్చాయని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. ఇంటర్వెల్ వరకు అసలు కథలోకి వెళ్లలేదట. అయినా సరే ఆడియన్స్ అందరినీ ఎంగేజ్ చేసేలా సినిమా చేశారట.
ఇంటర్వెల్ టు క్లైమాక్స్...
అభిమానులకు ఫుల్ మీల్స్!
ఫస్ట్ హాఫ్ యాక్షన్ సన్నివేశాలతో ఎంటర్టైన్ చేసిన దర్శకుడు... సెకండ్ హాఫ్ కామెడీ మీద ఫోకస్ చేశారని తెలిసింది. అజిత్ మాస్ డైలాగ్స్, ఆయన వేసే వన్ లైన్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఫుల్లుగా నవ్విస్తాయట. కథ కంటే కూడా అజిత్ హీరోయిజం మీద దర్శకుడు ఎక్కువ డిపెండ్ కావడంతో స్టోరీ పరంగా సగటు ప్రేక్షకులు కాస్త నిరాశ చెందే అవకాశం ఉంది. అయితే అభిమానులు మాత్రం అజిత్ నుంచి కోరుకునే మాస్ కమర్షియల్ సినిమా రావడంతో హ్యాపీగా థియేటర్ల నుంచి బయటకు వస్తారని టాక్.
'విడా ముయర్చి'తో అజిత్, త్రిష జంట డిజాస్టర్ అందుకుంది. అయితే ఆ సినిమా విడుదలైన రెండు నెలలలో 'గుడ్ బాడ్ అగ్లీ'తో బౌన్స్ బ్యాక్ అయింది. సినిమాకు మంచి టాక్ రావడంతో వాళ్ళిద్దరి ఖాతాలో మరొక విజయం పడిందని అనుకోవచ్చు. 'గుడ్ బాడ్ అగ్లీ'లో అర్జున్ దాస్ విలన్ రోల్ చేశారు. ఆయనతో ఒక సాంగ్ లో స్టెప్పులు కూడా వేయించారు దర్శకుడు. ఆ స్టెప్స్, ఆ సాంగ్ క్రింజ్ అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. అభిమానుల నుంచి సినిమాకు మంచి టాక్ వస్తుంటే ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రివ్యూలు కూడా కొన్ని వస్తున్నాయి.