Ajtih Kumar's Good Bad Ugly Telugu Trailer Released: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar), స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly). ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించగా.. తాజాగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ నెల 10న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అజిత్ మాస్ యాక్షన్ అదుర్స్
ఈ సినిమాలో అజిత్ మాస్ యాక్షన్ అదిరిపోయింది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ఆయన లుక్ ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ అజిత్ అభిమానులను కట్టిపడేశాయి. 'దమ్ము నా కోసం వదిలిపెట్టా, మందు నా వైఫ్ కోసం వదిలిపెట్టా. వయలెన్స్ నా కొడుకు కొసం వదిలిపెట్టా.' అని సాగే డైలాగ్ ఆకట్టుకుంటోంది. గ్యాంగ్ స్టర్‌గా ఉన్న వ్యక్తి అనుకోని కారణాలతో దాన్ని వదిలిపెట్టగా.. తన కొడుకు ఆపదలో ఉంటే ఓ రిటైర్డ్ గ్యాంగ్ స్టర్ ఏం చేశాడు?, అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే ప్రధానాంశంగా మూవీ సాగనున్నట్లు తెలుస్తోంది.
ఆయన 'భయాన్నే భయపెడతాడు' అని చెప్పే డైలాగ్ హీరో ఎలివేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. హీరో అజిత్‌ను డిఫరెంట్ అవతార్స్‌లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేసిన విధానం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్, అజిత్ స్వాగ్‌ని మెస్మరైజింగ్‌గా ప్రజెంట్ చేశారు. అజిత్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించగా.. అర్జున్‌దాస్, ప్రభు, ప్రసన్న, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సినిమాకు సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సినిమాను పెద్దఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
Also Read: ఈ వారమే ఓటీటీలోకి రూ.50 కోట్లు సాధించిన 'కోర్ట్' మూవీ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
అజిత్, త్రిష జంటగా ఆరో సినిమా
'గుడ్ బ్యాడ్ అగ్లీ' అజిత్, త్రిష జంటగా నటించిన ఆరో సినిమా. మూవీలో ఆమె రమ్య పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్ ఆకట్టుకుంటోంది. వీరిద్దరి కాంబోలో ఇటీవల విడుదలైన 'విదాముయర్చి' (తెలుగులో పట్టుదల) బక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అంతకు ముందు 'కిరీదం', 'జి', 'గ్యాంబ్లర్' (తమిళంలో 'మంకత్తా'), 'ఎంతవాడుగాని' (తమిళంలో 'ఎన్నై ఆరిందాల్'). 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోందని.. మూవీ విజయం ఖాయమంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.