Mem Famous Suman Second Movie Godari Gattupaina: యంగ్ హీరో సుమన్ ప్రభాస్ నటించిన రెండో సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవల మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నాము అంటూ ఓ స్పెషల్ గ్లిమ్స్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు చిత్ర బృందం. తాజాగా స్పెషల్ పోస్టర్‌తో మూవీ టైటిల్‌ని 'గోదారి గట్టుపైన' అని ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. 

సుమంత్ ప్రభాస్ రెండో మూవీ టైటిల్ 'మేం ఫేమస్' మూవీతో హీరోగా, దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుమంత్ ప్రభాస్. ఈ యంగ్ హీరోకి ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది 'మేం ఫేమస్'. తొలి సినిమానే అయినప్పటికీ సుమంత్ అదరగొట్టాడు. ఇక ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్‌తో పాపులర్ అయిన డైరెక్టర్ సుభాష్ చంద్ర ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయే. ఈ మూవీలో సుమంత్ ప్రభాస్‌తో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా రొమాన్స్ చేయబోతోంది. 

రెడ్ పప్పెట్ ప్రొడక్షన్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. నాగవంశీ కృష్ణ సంగీతం అందిస్తున్నారు. జగపతిబాబు, హర్షవర్ధన్, సుదర్శన్, రాజీవ్ కనకాల, రాజ్ కుమార్ కసిరెడ్డి, రోహిత్ కృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా, గోదారిలోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నాం అంటూ గ్లిమ్స్ ద్వారా మూవీ లవర్స్‌ని అలర్ట్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమాకి 'గోదారి గట్టుపైన' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా వెల్లడించారు. "చల్లని సాయంత్రం స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ, మనసారా నవ్వుకుంటూ, అలా గడిపేస్తే భలే ఉంటుంది కదా... అలాగే ఉంటుంది మా గోదారి గట్టుపైన" అంటూ క్రియేటివ్‌గా మూవీ టైటిల్‌ని వెల్లడించారు. ఇటీవలే విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని 'గోదారి గట్టుపైన' సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే టైటిల్‌తో మూవీ రాబోతుండడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ వంటి వివరాలను అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 

'మేమ్ ఫేమస్' ఓటీటీ స్ట్రీమింగ్ ఇదిలా ఉండగా, 'మేమ్ ఫేమస్' మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఊర్లో బలాదూర్ తిరిగే ముగ్గురు యువకులు ఎలా ఫేమస్ అయ్యారనే కథని కామెడీగా, ఎమోషనల్ గా ఈ మూవీలో చూపించారు. ఇందులో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు.