సత్యదేవ్ (Sathyadev) కథానాయకుడిగా నటించిన సినిమా 'గాడ్సే' (Godse Movie). 'బ్లఫ్ మాస్టర్' వంటి విజయవంతమైన సినిమా తర్వాత గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించారు. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నేడు ట్రైలర్ (Godse Telugu Movie Trailer) విడుదల చేశారు.


'గాడ్సే' ట్రైలర్ విషయానికి వస్తే... 'సత్యమేవ జయతే అంటారు. ధర్మో రక్షిత రక్షితః అంటారు. కానీ, సమాజంలో సత్యం, ధర్మం ఎప్పుడూ స్వయంగా గెలవడం లేదు' అని సత్యదేవ్ చెప్పే డైలాగ్ తో మొదలైంది. హీరోని పట్టుకోవడం కోసం బ్లాక్ కమాండోలు ప్రయత్నించడం... అతడిని షూట్ చేయడం వంటివి చూపించారు. ప్రభుత్వ పథకాలు, అవినీతీపై ప్రశ్నించే పాత్రను సత్యదేవ్ పోషించినట్టు అర్థం అవుతోంది.
 
'పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత? అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత? గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత? సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?' అని హీరో చెప్పే మాట రాష్ట్ర ప్రభుత్వాలకు సూటిగా తగులుతుందని చెప్పవచ్చు. '90 శాతం ప్రజాప్రతినిధులు అఫిడివిట్ చేసి జ్యుడిషియల్ స్టాంప్ వేసుకున్న నామినేషన్ పత్రాలు... అన్నీ అబద్ధాలే' అని రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించారు.  'ప్రశ్నిస్తే... మారణకాండ చేసేస్తారా?' అనే మాట హీరోకి జరిగిన అన్యాయాన్ని తెలిపింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రమిదని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.


'అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్ధతి ఉన్నోడే పార్లమెంట్‌లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి. సభ్యత ఉన్నోడే సర్పంచ్ కావాలి' అని సత్యదేవ్ చెప్పే డైలాగ్ రాజకీయ నాయకుల అర్హతను ప్రశ్నించేలా ఉంది.


Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ


ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి  (Aishwarya Lekshmi) కథానాయిక. ఆమె పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ చేశారు. 'నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే చూస్తుండటం నా వల్ల కాదు సార్' అని ఆమె చెప్పే డైలాగ్... ఆ పాత్రలో హ్యుమానిటీని తెలియజేస్తోంది. ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం: సురేష్ రగుతు, సంగీతం: శాండీ అడ్డంకి.



Also Read: నా జీవితం నయనతారకు అంకితం, మీ అందరికీ రుణపడి ఉంటా - పెళ్లికి ముందు విఘ్నేష్ శివన్ ఎమోషనల్ పోస్ట్