Geethanjali Movie OTT Streaming Details: ప్రస్తుతం ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈవారంలో ఓటీటీకి పెద్ద సినిమాలు, కామెడీ, హారర్‌ చిత్రాలు వచ్చేశాయి. రీసెంట్‌ బ్లాక్‌బస్టర్ చిత్రం మంజుమ్మల్‌ బాయ్స్, సైతాన్‌ వంటి చిత్రాలు ఓటీటీలోకి రాగా తాజాగా లేటెస్ట్‌ తెలుగు హారర్‌ మూవీ డిజిటల్‌ ప్రిమియర్‌కు సిద్ధమైంది. అంతే హీరోయిన్ అంజలి 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. అంజలి కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, 'సత్యం' రాజేష్, సునీల్, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. పదేళ్ల క్రితం వచ్చిన 'గీతాంజలి' మూవీకి ఇది సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే.


ఫస్ట్‌ పార్ట్‌ మంచి విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 11న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్‌ని ఫిక్స్‌ చేసుకుందట. నెల రోజుల్లోనే డిజిటల్‌ ప్రీమియర్‌కు రాబోతుంది. గీతాంజలి మళ్లీ వచ్చింది డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైం సొంతం చేసుకుందట. దీంతో మే 10 నుంచి సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమెజాన్‌ ప్లాన్‌ చేస్తుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే అమెజాన్‌ నుంచి అప్‌డేట్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 


కథేంటంటే..


తొలి పార్ట్ 'గీతాంజలి' మూవీ ఎండింగ్‌లో‌ రావు రమేష్‌ మరణించిన తర్వాత ఏం జరిగిందనే కోణంలో సీక్వెల్‌ని తీసుకువచ్చారు. ఇక కథ విషయానికి వస్తే.. తన తొలి చిత్రం 'గీతాంజలి' విజయం తర్వాత దర్శకుడు శ్రీను (శ్రీనివాస రెడ్డి) మూడు ప్లాప్స్‌ చూస్తాడు. దాంతో అతనితో సినిమా చేసేందుకు నిర్మాత ఎవరు ధైర్యం చేయరు. దీంతో ఖర్చులకు డబ్బుల లేకపోడం శ్రీనివాస్‌ తన స్నేహితుడు అయాన్ (స్వామిరారా సత్య)కు అబద్ధం చెప్పి మోసం చేస్తాడు. తన నెక్ట్స్‌ మూవీ 'దిల్' రాజుతోనే అని, ఇందులో నువ్వే హీరో అని అబద్ధాలు చెప్పి అతడి దగ్గర లక్షలకు లక్షలు డబ్బులు గుంజుతాడు.


ఓ రోజు శ్రీనుకు చెప్పకుండా హైదరాబాద్ వచ్చిన అతడి స్నేహితుడు అయాన్ తాను మోసపోయాయని తెలుసుకుంటాడు. చేసేది లేక శ్రీను తన రైటర్స్ ఆరుద్ర, ఆత్రేయ ('సత్యం' రాజేష్, 'షకలక' శంకర్)లతో కలిసి తన ఫ్రెండ్‌ అయాన్ ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అంతా వదిలేసి కృష్ణానగర్ వదిలి ఇంటికి వెళ్లితున్న టైంలోనే శ్రీను ఫోన్ కాల్‌ వస్తుంది. డైరెక్షన్ ఛాన్స్ ఆఫర్ ఊటీలోని విష్ణు రిసార్ట్స్ యజమాని విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా (శ్రీకాంత్ అయ్యంగార్) శ్రీను ఫోన్‌ చేయడంతో అంతా  ఊటీకి వెళతారు.



తాను రాసిన కథతో సంగీత్ మహల్‌లో షూటింగ్ చేయాలని విష్ణు పెట్టిన కండిషన్‌కు ఓకే చెప్పడంతో పాటు హీరోయిన్‌గా అంజలి (అంజలి)ని ఒప్పించి సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళతారు. సంగీత్‌ మహల్‌లో షూటింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ మహల్‌లో మరణించిన భార్యభర్తలు ఆత్మలుగా మారి ప్రతి ఆగస్టు 8కి ప్రేమికుల మీద పగ తీర్చుకుంటాయనేది ఊటీ ప్రజల నమ్మకం. మరి ఆ సంగీత్ మహల్‌లో నిజంగానే ఆత్మలు ఉన్నాయా? అంజలి సోదరి గీతాంజలి (అంజలి) ఆత్మ మళ్లీ ఎందుకు వచ్చింది? గీతాంజలి చేతిలో మరణించిన రమేష్ (రావు రమేష్)కు, విష్ణుకు సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది? అనేదే కథ.  


Also Read: ఇంటర్నేషనల్‌ వేదికపై సత్తా చాటిన 'హాయ్‌ నాన్న' - స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో మూవీకి అవార్డుల పంట