Saripodhaa Sanivaaram First Single Out Now: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న అప్‌కమింగ్ మూవీ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా విడుదలకు దాదాపు రెండు నెలలు టైమ్ ఉంది కానీ అప్డేట్స్ ఇచ్చే విషయంలో మేకర్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. అంతే కాకుండా అప్పుడప్పుడు కొత్త కొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ‘సరిపోదా శనివారం’ నుండి మొదటి పాట విడుదలయ్యింది. ‘గరం గరం’ అంటూ సాగే ఈ పాట.. ప్రోమోతోనే అందరినీ ఆకట్టుకోగా ఫుల్ సాంగ్ కూడా అదే రేంజ్‌లో ఉంది.
పాటతో క్లారిటీ..
నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని సినిమాలు, అందులోని పాటలు ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ హీరో తన కెరీర్‌లో నటించిన మాస్ కమర్షియల్ సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఇక ‘సరిపోదా శనివారం’ నుండి విడుదలవుతున్న అప్డేట్స్ చూస్తుంటే ఇది కూడా ఒక మాస్ కమర్షియల్ మూవీ అని, ఇందులో నాని క్యారెక్టర్ ఫుల్ మాస్సీగా ఉండబోతుందని అర్థమవుతోంది. తాజాగా విడుదలయిన ‘గరం గరం’ చూస్తుంటే ఈ విషయం కన్ఫర్మ్ అయిపోతుంది. అసలు ‘సరిపోదా శనివారం’లో నాని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఈ పాటలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. దానికి రాక్ మ్యూజిక్‌ను యాడ్ చేశాడు సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్.
రంగంలోకి బాలీవుడ్ సింగర్..
‘సరిపోదా శనివారం’లో నాని.. సూర్య అనే పాత్రలో కనిపించనున్నాడు. అంటే వారమంతా సహనంగా ఉండి శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించే ఒక విచిత్రమైన క్యారెక్టర్. ఇప్పటికే గ్లింప్స్‌లో సూర్య క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుందో వివరించారు మేకర్స్. మరోసారి ‘గరం గరం’ పాటలో కూడా అదే చేశారు. సూర్యకు కోపం వస్తే ఎలా ఉంటుంది, ఆ కోపాన్ని దాచిపెట్టుకున్నప్పుడు తను ఎలా ఉంటాడు అనేది తన లిరిక్స్‌లో వివరించారు. దానికి ఒక రాక్ మ్యూజిక్‌ను యాడ్ చేసి, బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీని రంగంలోకి దించి పాటను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాడు జేక్ బిజోయ్. నాని కెరీర్‌లో ఇది ముందెన్నడూ చూడని పాట అని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇంట్రడక్షన్ సాంగ్..
మామూలుగా నాని సినిమాల్లో పాటలన్నీ చాలా ప్రశాంతంగా ఉంటాయి. వాటన్నింటికంటే ‘సరిపోదా శనివారం’లోని ‘గరం గరం’ చాలా డిఫరెంట్. ఇప్పటివరకు నాని నటించిన సినిమాల్లో తన క్యారెక్టర్‌ను వివరిస్తూ తెరకెక్కిన పాటల సంఖ్య చాలా తక్కువ. అందుకే ఈ హీరో కెరీర్‌లోనే ఇలాంటి ఒక పాట చూడలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొత్తానికి మాస్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌కు కూడా నచ్చే ఒక ఇంట్రడక్షన్ సాంగ్‌తో ‘సరిపోదా శనివారం’ టీమ్ ఆకట్టుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ యాక్టర్, డైరెక్టర్ ఎస్ జే సూర్య ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also Read: అఖిల్ షాకింగ్ లుక్ - ఇదంతా అయ్యగారి కొత్త సినిమా కోసమేనా?