Gangs of Godavari Day 2 Box Office Collections: మే నెలాఖరులో మూడు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ మూడు కమర్షియల్ జోనర్‌కు చెందినవే. కానీ అన్నింటికంటే విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకే ఎక్కువగా హైప్ క్రియేట్ అయ్యింది. మూవీ లవర్స్ కూడా ముందుగా ఈ సినిమాను చూడడానికే ఆసక్తి చూపించారు. అందుకే ఫస్ట్ వీకెండ్‌లో మెల్లగా కలెక్షన్స్ పెరగడం మొదలయ్యింది. విడుదలయిన రెండో రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో మేకర్స్ బయటపెట్టారు.
సింగిల్ స్క్రీన్స్‌లో ఉత్సాహం...
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా సింగిల్ స్క్రీన్‌లో మళ్లీ ఉత్సాహం నింపిందని మేకర్స్ గర్వంగా ప్రకటించారు. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ కాక ముందే పది కోట్ల క్లబ్బులో సినిమా ఎంటర్ అయింది. రెండు రోజుల్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. రెండో రోజు ఈ మూవీ... ప్రపంచవ్యాప్తంగా రూ. 12.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక ఆదివారం పూర్తయ్యే సమయానికి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి మిక్స్‌డ్ టాక్‌తో కూడా మూవీకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అనుకుంటున్నారు.
ఓవర్సీస్‌లో రచ్చ..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకు 25.89 శాతం ఆక్యుపెన్సీ లభించింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా దూసుకుపోతోందని మేకర్స్ ప్రకటించారు. అమెరికన్ బాక్సాఫీస్‌లో ఇప్పటికే 200 డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని సంతోషంగా బయటపెట్టారు. దీంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్లడం పెద్ద కష్టం కాదని ఇండస్ట్రీ నిపుణులు చర్చించుకుంటున్నారు. మాస్ రోల్స్ అనేవి యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు బాగా సూట్ అవుతాయని ఫ్యాన్స్ అంటుంటారు. అలాగే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నాకర్‌గా విశ్వక్ యాక్టింగ్‌కు వారు ఫిదా అవుతున్నారు.
టైగర్ రత్నాకర్ కథ..
గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగిన రత్నా అనే కుర్రాడు టైగర్ రత్నాకర్‌గా ఎలా ఎదిగాడు అనే అంశంపై ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తెరకెక్కింది. ఈ సినిమాలో కుల రాజకీయాల గురించి కూడా చెప్పుకొచ్చాడు దర్శకుడు కృష్ణ చైతన్య. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ... ఈ చిత్రాన్ని నిర్మించారు. 2 గంటల 26 నిమిషాల మూవీలో ప్రేక్షకులు అక్కడక్కడా బోర్‌గా ఫీల్ అయినా కూడా ఎక్కువ శాతం విశ్వక్ సేనే సినిమాను ముందుండి నడిపించాడని ఫ్యాన్స్ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఇందులో విశ్వక్ సేన్‌కు జోడీగా నేహా శెట్టి నటించగా మరో కీలక పాత్రలో అంజలి కనిపించింది.
Also Read: రాత్రి రాసి పొద్దున్నే పోస్టు చేస్తున్నారు - రివ్యూలపై విశ్వక్ సేన్ ఫైర్