Vishwak Sen About Negative Reviews On Gangs Of Godavari: టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా పమే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తమ సినిమాకు వచ్చిన రివ్యూలపై నటుడు విశ్వక్ సేన్ సెటైర్లు వేశారు.


సినిమా చూడకుండానే రివ్యూలు రాస్తున్నారు- విశ్వక్


గత కొంత కాలంగా సినిమా రివ్యూలపై భిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాలకు వెంటనే రివ్యూలు ఇవ్వడం వల్ల చాలా మంది నష్టపోయే అవకాశం ఉందని, కనీసం వారం రోజుల తర్వాత రివ్యూ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని విశ్వక్ సేన్ ముందుకు ప్రస్తావించగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారం సంగతేమో గానీ, సినిమా చూడక ముందే కొంత మంది రివ్యూలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా పొద్దున్నే 5 గంటలకే కొంత మంది రివ్యూలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. సినిమాలో యాక్షన్ బాగాలేదు, మ్యూజిక్ బాగాలేదని రాసుకొచ్చారని మండిపడ్డారు. సినిమా చూడకుండా రివ్యూ రాశారు అనడానికి ఈ రెండు పాయింట్లు చాలని చెప్పారు. “కొంత మంది రివ్యూ రైటర్లు సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకు పొద్దేన్నే 5 గంటలకే రివ్యూ ఇవ్వడం చూసి ఆశ్చర్యపోయా. సినిమా చూడక ముందే రివ్యూ ఇవ్వడమేంటో అర్థం కాలేదు. రాత్రి పూట రాసుకున్న రివ్యూను పొద్దున్నే పోస్టు చేశారంతే. ఇలాంటి రివ్యూల వల్ల సినిమాల కోసం కష్టపడుతున్న వారికి ఇబ్బందులు కలుగుతాయి” అన్నారు.


థియేటర్లకు జనం వస్తున్నందుకు సంతోషించాలి- విశ్వక్


ఇటీవల కొంత మంది సినిమా థియేటర్లు మూసేయాలని కామెంట్ చేశారని, కానీ, ఇప్పుడు థియేటర్లకు జనాలు రావడం సంతోషంగా ఉందన్నారు విశ్వక్ సేన్. “ఇతర సినిమా పరిశ్రమలతో పోల్చితే తెలుగులో థియేటర్ల నిర్వహణ ద్వారా ఎంతో మంది బతుకుతున్నారు. గత రెండు నెలలుగా పెద్దగా సినిమాలు లేవు. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులు వస్తున్నారు. అయితే, కొంత మంది సినిమా చూడకుండానే రివ్యూలు ఇవ్వడం బాధాకరం. ఫస్టాఫ్ కు ఒక రివ్యూ, సెకెండాఫ్‌కు మరో రివ్యూ ఇస్తున్నారు. సినిమా మధ్యలో పాజ్ చేసి రివ్యూ ఇస్తున్నారేమో అర్థం కావట్లేదు. శత్రువులు మరెక్కడో లేరు. మన మధ్యలోనే ఉన్నారు. మనం పరిస్థితులను మార్చలేం. డిస్ట్రిబ్యూటర్ కు కాల్ చేస్తే మూడ్ సెట్ అయిపోతుంది. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులకు తెలుసు. వారే మా సినిమాను ఆదరిస్తారు” అని విశ్వక్ సేన్ వెల్లడించారు.  


Read Also: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత