గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందించిన 'గేమ్ చేంజర్' (Game Changer) విడుదల పనులలో దర్శకుడు శంకర్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా ఈ సినిమా మీదే ఉంది. అయితే, దీని కంటే ముందు మొదలైన కమల్ హాసన్ 'ఇండియన్ 3' సంగతి ఏంటి? ఓ తమిళ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమాపై శంకర్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే...
'గేమ్ చేంజర్' విడుదల తర్వాతే...
కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన 'ఇండియన్' (తెలుగులో 'భారతీయుడు') సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక క్లాసిక్. అది విడుదలైన 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీశారు. అయితే... 'ఇండియన్ 2' థియేటర్లలో ఆశించిన స్పందన అందుకోలేదు.
'ఇండియన్ 2' విడుదలకు ముందు ఇండియన్ 3 అనౌన్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే, విడుదల ఎప్పుడు? అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. మధ్యలో బోలెడు పుకార్లు వచ్చాయి. తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు శంకర్.
Shankar On Indian 3 Release: ''ఈ 'గేమ్ చేంజర్' విడుదల తర్వాత 'ఇండియన్ 3' పనులు ప్రారంభిస్తా. విడుదల తేదీ గురించి కూడా రామ్ చరణ్ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తా'' అని శంకర్ పేర్కొన్నారు. అది సంగతి.
'ఇండియన్ 3' ఓటీటీలో విడుదల అవుతుందా?
Indian 3 Release Date: 'ఇండియన్ 3' వార్తల్లో ఉండడం ఇది ఏమీ తొలిసారి కాదు. గతంలో ఓసారి ఆ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. ఆ సమయంలో దర్శకుడు శంకర్, అలాగే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పుకార్లను కొట్టిపారేసింది. తమ సినిమాను నేరుగా థియేటర్లలో విడుదల చేస్తామని ఆ తర్వాతే ఓటీటీలో విడుదల అవుతుందని తెలిపింది.
Also Read: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?