ఏడాది 'దసరా'(Dasara) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'హాయ్ నాన్న'(Hi Nanna) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రంతో వెండితెరకు అరంగేట్రం చేస్తున్నాడు. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ మూవీలో నాని సరసన మొదటిసారి సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సమయమా సాంగ్ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన కనబరిచింది. వీటిని చూసిన ఫ్యాన్స్ నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీని డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ కానీ 'హాయ్ నాన్న' రిలీజ్ డేట్ కి ప్రభాస్ 'సలార్' సినిమా విడుదల కాబోతుండడంతో 'హాయ్ నాన్న' మూవీ డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ కాబోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్ డేట్ కాస్త అటు ఇటుగా మార్చినా ప్రమోషన్స్ విషయంలో మాత్రం మూవీ టీమ్ అసలు వెనక్కి తగ్గడం లేదు. సినిమా రిలీజ్‌కు చాలా సమయం ఉన్నా కూడా రీసెంట్ గానే మ్యూజికల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసి ఫస్ట్ సింగిల్ 'సమయమా..' సాంగ్ ని విడుదల చేశారు.






విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీతో డబ్ల్యూ హిట్ అందుకున్న మలయాళ సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'సమయమా' సాంగ్ యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ ని అందుకుంది. ఇక ఇప్పుడు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాట తండ్రీ, కూతురు ప్రేమ కథను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 'గాజు బొమ్మ'(Gaaju Bomma) అంటూ సాగే ఈ సాంగ్ ని అక్టోబర్ 6న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజా వీడియోలో రిలీజ్ చేశారు.


అనౌన్స్మెంట్ వీడియో చివర్లో మ్యూజిక్ డైరెక్టర్ హేయమ్ అబ్దుల్  మ్యూజిక్ బిట్ అయితే అద్భుతంగా ఉంది. 'ప్రతి ఫాదర్ కి ఈ సాంగ్ చాలా స్పెషల్ గా ఉండబోతుందని' నాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో 'హాయ్ నాన్న' సెకండ్ సింగిల్ కు సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. మరి ఇప్పటికే విడుదలైన 'సమయమా' సాంగ్ కి మంచి రెస్పాన్స్ రాగా, అక్టోబర్ 6న విడుదల కాబోయే 'గాజుబొమ్మ' సాంగ్‌కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో చూడాలి. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి, మూర్తి కేఎస్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ సినిమా అనంతరం నాని తన తదుపరి చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేస్తున్నారు.


Also Read : సలార్ ఎఫెక్ట్, వారం ముందుకు జరిగిన 'మేరీ క్రిస్మస్' - కొత్త రిలీజ్ డేట్ ఇదే!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial