తెలుగు ప్రేక్షకులలో హారర్ జానర్‌లకు ఉండే క్రేజ్ వేరు. ఒకానొక సమయంలో వరుసపెట్టి హారర్ కామెడీలు వచ్చాయి. కేవలం భయపెట్టడమే లక్ష్యంగా కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హారర్ సినిమాల ప్రయాణం ఎప్పుడు మొదలైందో తెలుసా?
తెలుగులో తొలి హారర్ సినిమా 'జగన్మోహిని'!First Horror Movie In Tollywood: తెలుగులో వచ్చిన తొలి హారర్ సినిమా ఏది? అంటే... 1978లో వచ్చిన 'జగన్మోహిని' (Jaganmohini Movie)తో ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఆ సినిమా ఆడియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. హారర్ జానర్‌లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తరువాత రకరకాల హారర్ జానర్ సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాయి. హారర్ సినిమాలకు మంచి మార్కెట్ ఉందని అర్థం చేసుకున్న తెలుగు దర్శక నిర్మాతలు, రచయితలు ఎక్కువగా వాటి మీద ఫోకస్ పెట్టారు.
హారర్ ట్రెండ్ పీక్స్‌కు తీసుకు వెళ్లిన వర్మ!తెలుగులో హారర్ సినిమాలను మెయిన్ ట్రెండ్ చేసిన దర్శకుడు అంటే రామ్ గోపాల్ వర్మ అని చెప్పాలి. 1990, 2000లలో ఆయన రాత్ (రాత్రి), దెయ్యం వంటి హారర్ సినిమాలు ఇండస్ట్రీలో మార్పులకు నాంది పలికాయి. ప్రేక్షకులకు కొత్త హారర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. దాంతో తెలుగునాట హారర్ సినిమాలకు మరింత జోరు పెరిగింది. ఆర్జీవీ ప్రత్యేక శైలితో తెరకెక్కించిన ఆ చిత్రాలు అందరికీ సరికొత్త బాటను వేశాయి.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన '13B'... దానికి ముందు కోడి రామకృష్ణ దర్శకత్వంలోని 'అమ్మోరు', 'అరుంధతి' వంటి డివోషనల్ హారర్ చిత్రాలు సైతం తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఆ తర్వాత మారుతి తెరకెక్కించిన 'ప్రేమ కథా చిత్రమ్', ఓంకార్ తీసిన 'రాజు గారి గది' ఫ్రాంచైజీలతో హారర్‌కు కామెడీని యాడ్ చేయడం ట్రెండ్‌గా మారింది. ఇప్పటికీ ఆ ట్రెండ్‌నే మేకర్స్ ఫాలో అవుతున్నారు.
హారర్ కామెడీ జానర్లో వచ్చిన 'ఆనందో బ్రహ్మ' ఒక డిఫరెంట్ అటెంప్ట్. దెయ్యాలను చూసి మనుషులు భయపడటం కాదు... అందులో మనుషులను చూసి దెయ్యాలు భయపడతాయి. అది కొత్త ప్రయత్నం. హిట్ అయ్యింది. హారర్ కామెడీలు ఎక్కువైన తర్వాత, అందరూ అటువంటి సినిమాలే తీస్తున్న రోజుల్లో మళ్ళీ ప్యూర్ హారర్ కామెడీ సత్తా చాటిన సినిమా 'మసూద'. అందులో కామెడీ లేదు. కేవలం హారర్ ఉంది. ముస్లిం దెయ్యాన్ని చూపించడం అందులో ప్రత్యేకత. అలాగే సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' వంద కోట్ల క్లబ్బులో చేరింది. తమిళ్ నుంచి వచ్చిన 'చంద్రముఖి' వంటి సినిమాలు సైతం తెలుగులో విజయాలు సాధించాయి. ఇప్పుడు 'కిష్కింధపురి' సినిమా రాబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో తెరకెక్కించిన ఈ సినిమా మరోసారి తెలుగు వారికి హారర్ జానర్ సత్తాను చాటుతుందో లేదో చూడాలి.
Also Read: 'కూలీ'లో విలన్‌గా సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్... మహానటిని మించిన అపరిచితురాలు - ఎవరీ రచితా రామ్?