హీరో విజయ్, పూజా హెగ్డే నటించిన ‘బీస్ట్’ బుధవారం నుంచి థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై విజయ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. పైగా, ఈ సినిమాలోని ‘‘అరిబిక్ కుతు’’ సాంగ్ కూడా బాగా హిట్ కావడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అయితే, సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఈ చిత్రం విజయ్ అభిమానులకే నచ్చలేదనే ప్రచారం జరుగుతోంది. సినిమా బాగోలేదనే కారణంతో తమిళనాడులోని ఓ థియేటర్‌లో స్క్రీన్‌ నిప్పు పెట్టారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ ఘటన మధురైలోని ఓ థియేటర్లో చోటుచేసుకున్నట్లు తెలిసింది. అయితే, అది అభిమానులు పెట్టిన నిప్పా? లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల తెరకు మంటలు అంటుకున్నాయా అనేది తెలియాల్సి ఉంది. తెరకు మంటలు వ్యాపించినా.. సినిమాను కాసేపు కొనసాగింది. థియేటర్లో ప్రేక్షకులు హహాకారాలు చేయడంతో అసలు విషయం తెలిసి సినిమాను నిలిపేశారు. వెంటనే మంటలను అర్పివేశారు.


Also Read: 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?


ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజనులు విజయ్ అభిమానులను తిట్టి పోస్తున్నారు. సినిమా నచ్చకపోతే థియేటర్‌ను తగలబెట్టేస్తారా? ఇందులో వారి తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అయితే, అజీత్ అభిమనులే ‘బీస్ట్’ చిత్రంపై నెగటివ్‌గా ప్రచారం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘వాలిమై’ చిత్రం కూడా ఫ్లాప్ కావడంతో అజీత్ అభిమానులు ‘బీస్ట్’పై కన్నేశారు. ఈ చిత్రం కూడా బాగాలేదనే ప్రచారం జరగడంతో సంబరాలు చేసుకుంటున్నారు. వీళ్ల మధ్య వార్ ఇంకెన్నాళ్లు సాగుతుందో చూడాలి. 


Also Read: మహేష్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్- ఒక్క పాట పూర్తైతే చాలు పండగే