ప్రేక్షకులు తమ అభిమాన హీరోల సినిమాలు రాగానే థియేటర్లకు పరుగుతీస్తారు. టికెట్ రేట్లు పెరిగినా.. తగ్గినా మూవీలను చూస్తుంటారు. ఇదే అదనుగా భావించి కొన్ని థియేటర్ల యాజమాన్యాలు నిలువు దోపిడి చేస్తుంటాయి. ప్రేక్షకుల నుంచి టికెట్ అసలు ధర కన్నా ఎక్కువ వసూలు చేస్తుంటారు. మూడేళ్ల కిందట ఇదే జరిగింది. అయితే, మూడేళ్ల నాటి ముచ్చట ఇప్పుడెందుకు భాయ్ అని అనుకుంటున్నారా? ఎందుకో చూడండి. 


టికెట్‌పై అదనంగా రూ.11.74 వసూలు చేసిన థియేటర్


హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు 2021లో  చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న షాలిని -శివాని థియేటర్లలో సినిమా చూసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం ఒక్కో టికెట్‌పై రూ.11.74 అదనంగా వసూలు చేశారు. దీంతో వారిద్దరు థియేటర్ కు వ్యతిరేకంగా నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ(NAA)ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన NAA ఎట్టకేలకు బాధితులకు న్యాయం జరిగే చర్యలు తీసుకుంది. ఒక్కో టికెట్‌పై విధించిన అదనపు మొత్తానికి 18 శాతం వడ్డితో తిరిగి నగదు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వ వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.13 లక్షల జరిమానా కట్టాలని వెల్లడించింది. 




Read Also: 'మామా మశ్చీంద్ర' మూవీ వీడియో లీక్, సుధీర్ బాబు లుక్ చూసి ఆడియన్స్ షాక్!