Fast Charlie director About RRR And Indian Films: 'ఆర్ఆర్ఆర్'... తెలుగు చిత్రసీమ గురించి ప్రపంచానికి చెప్పిన సినిమా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వపడేలా చేసిన సినిమా. ఆస్కార్ అవార్డు అందుకుని రికార్డులు సృష్టించిన సినిమా. ఎంతోమంది ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాకి చెందిన ప్రముఖ డైరెక్టర్ ఫిలిప్ నోయ్స్ 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఇండియాలో తను ఒక సినిమా చేయాలనే కోరికను బయటపెట్టారు. అది కూడా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో సినిమా తియ్యాలని ఉందట. ఇండియన్స్ సినిమా చాలా ప్రేమిస్తారని వాళ్ల మధ్య ఉండి సినిమా చూడాలని అనుకున్నా కానీ, కుదరలేదు అంటూ చెప్పారు.
ఫాస్ట్ చార్లీ..
ఆస్ట్రేలియాకి చెందిన డైరెక్టర్ ఫిలిప్ నోయ్స్ ఎన్నో మంచి మంచి సినిమా తెరకెక్కించారు. ఆయన తీసిన 'సాల్ట్' సినిమా భారీ హిట్ అయ్యింది. ఇటీవల 2023లో ఆయన తెరకెక్కించిన 'ఫాస్ట్ ఛార్లీ' సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా.. ఆ సినిమా ప్రస్తుతం మన దేశంలో రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఫిలిప్ మాట్లాడారు. “ ఇండియన్స్ నా సినిమా చూస్తున్నారంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను అక్కడే థియేటర్ లో వాళ్ల మధ్య సినిమా చూద్దాం అనుకున్నాను. వాళ్ల రియాక్షన్స్ లైవ్ లో ఎక్స్ పీరియెన్స్ చేద్దాం అనుకున్నాను. వాళ్లు సినిమాను చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ల ఎక్స్ ప్రెషన్స్, వాళ్ల పొగడ్తలు లైవ్ లో చూడాలని కోరికగా ఉంది” అని అన్నారు ఫిలిప్స్.
ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం..
ఫిలిప్ కి ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. 'ఆర్ఆర్ఆర్' చూశానని, అది ప్రపంచంలోనే చాలా పెద్ద సక్సెస్ ఫుల్ సినిమా అని చెప్పారు ఫిలిప్స్. దేవ్ పటేల్ మంకీ మ్యాన్ సినిమా అంటే కూడా తనకు చాలా ఇష్టం అని, 'ఆర్ఆర్ఆర్' లో స్టోరీ ఎలా చెప్పారో ఆ సినిమాలో కూడా అదే చెప్పారని అన్నారు. “నాకు ఇండియన్ సినిమాలంటే చాలా చాలా ఇష్టం. 'పథేర్ పాంచాలి' నా ఫేవరెట్ సినిమా. దాంట్లో ఉన్న ఎమోషన్స్ నన్ను నా కాలంలోకి తీసుకెళ్లాయి. ఇండియన్ సినిమాల్లో చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. నేను కూడా ఇండియాలో సినిమా తియ్యాలి. నాకు బాలీవుడ్ వాళ్లంటే చాలా ఇష్టం. దాంట్లో కూడా షారుఖ్ ఖాన్ తో సినిమా చేయాలని ఉంది. ఇండియాలో చాలా మంచి మంచి సినిమాలే ఉన్నాయి. వాటిని ప్రపంచంలోని అందరి ఆడియెన్స్ కి చేరేలా చేస్తే బాగుంటుంది. చాలా మంచి మంచి సినిమాలు వేరే దేశాల్లో రిలీజ్ అవ్వడం లేదు. చాలా మంచి సినిమాలు ఫిలిమ్ ఫెస్టివల్స్ లో చూస్తుంటాను కదా అప్పుడు నాకు అర్థం అవుతుంది” అంటూ ఇండియన్ సినిమాలు, ఆర్ ఆర్ ఆర్ గురించి చెప్పుకొచ్చారు ఫిలిప్స్.