Venkat Prabhu’s brother Premgi weds actress Indu, See Wedding Photos: తమిళ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని కమెడియన్ ప్రేమ్ కుమార్ గంగై అమరన్. ఆయన్ను అందరూ ప్రేమ్ జీ అని పిలుస్తుంటారు. ఎట్టకేలకు ఆయన ఒక ఇంటి వాడు అయ్యాడు. నటి ఇందు (Actress Indu)ని ఆయన పెళ్లి చేసుకున్నారు. అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో తిరుత్తనిలో ఆయన పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని ఆయన అన్న, డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
కొద్ది మంది సమక్షంలో..
ప్రేమ్ జీ, ఇందుల పెళ్లి శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తిరుత్తనిలోని గుడిలో కొద్ది మంది సమక్షంలో వివాహం జరిగింది. ప్రేమ్ జీ తన 45వ ఏట ఒక ఇంటి వాడు అయ్యాడు. ప్రేమ్ గి, ఇందు పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన అభిమానులు తెగ విషెస్ చెప్తున్నారు. చాలా ఎక్సైట్ మెంట్ తో వెంకట్ ఈ ఫొటోలను షేర్ చేశారు. ఫైనల్లీ.... అంటూ సాగదీస్తూ తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు ఆయన.
ప్రేమ వివాహం..
ప్రేమ్ జీ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమస్ కమెడియన్. కాగా... ఆయన ఇందును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి వాళ్లిద్దరూ రిలేషిన్షిప్ లో ఉన్నారు. పెద్దల సమక్షంలో ఇద్దరు ఒకటయ్యారు. త్వరలో తన తమ్ముడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ గతంలో వెంకట్ ప్రభు అనౌన్స్ చేశారు. ఆయన చెప్పిన కొన్ని రోజులకే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
Also Read: అమలా పాల్ డెలివరీకి అంతా రెడీ - బంప్ వీడియోకి బ్యాడ్ కామెంట్స్, నెటిజనులకు అది తెలియదా?
ఇక సినిమాల విషయానికి వస్తే.. వెంకట్ ప్రభు ప్రస్తుతం విజయ్ 'ది గోట్' సినిమాతో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 5న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘లియో’ సినిమా తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Also Read: కంగనా రనౌత్ చెంపదెబ్బ... స్పందించిన బాలీవుడ్ నటులు, హృతిక్ రోషన్ ఏమన్నాడంటే?