Abhishek Bachchan Like On Post About Divorce: సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది నటీనటులు ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో, అంతే త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పలువు సెలబ్రిటీలు డివోర్స్ తీసుకుంటున్నారు. కలిసి ఉండటం కష్టంగా మారినప్పుడు విడిపోవడమే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై వారిద్దరు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, రీసెంట్ గా జరిగిన అంబానీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ వేర్వేరుగా హాజరుకావడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.    


విడాకుల పోస్టుకు అభిషేక్ లైక్


మరోవైపు ప్రముఖ జర్నలిస్టు హీనా ఖండేల్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన విడాకుల పోస్టుకు అభిషేక్ లైక్ కొట్టారు. ఈ నేపథ్యంలోనే ఐశ్వర్యతో విడాకులు తీసుకోవడం ఖాయం అనే వార్తలను బలంగా వినిపించాయి. ఇంతకీ హీనా రాసిన పోస్టులో ఏం ఉందంటే.. “ప్రేమ కష్టంగా మారినప్పుడు విడాకులు తీసుకోవాలి అనుకుంటారు. కానీ, అది అంత సులభమైన విషయం కాదు. జీవితం అనేది మనం కోరుకున్నట్లు సాగదు. ఏళ్ల తరబడి కలిసి ఉండి, విడిపోయిన తర్వాత ఎలా ఉండగలుగుతారు? అసలు వివాహ బంధాన్ని ఎలా తెంచుకోవాలి అనుకుంటారు? 50 సంవత్సరాల వయసు దాటిన వాళ్లు కూడా విడిపోతున్నారు. వారి కారణాలు వింటే విచిత్రంగా ఉంటుంది” అని హీనా రాసుకొచ్చింది. దీనికి అభిషేక్ లైక్ కొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 


అభిషేక్ ఆ పోస్టు ఎందుకు లైక్ చేశారంటే?


తాజాగా అభిషేక్ విడాకుల పోస్టుకు లైక్ కొట్టడం వెనుక అసలు నిజం బయటకు వచ్చింది. ఐశ్వర్య చిరకాల మిత్రుడు జిరాక్ మార్కస్ హీనా పోస్టును హైలెట్ చేశారట. దానికి అభిషేక్ లైక్ కొట్టారు. అంతేకానీ, ఐశ్వర్యతో విడాకులు తీసుకోవాలనేది దాని ఉద్దేశం కాదని తేలింది. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ ఆ పోస్టుకు లైక్ చేయడం వెనుక పెద్ద విషయమేమీ లేదని, క్యాజువల్ గానే లైక్ చేశాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.    


ఇంతకీ జిరాక్ మార్కర్ ఎవరు?


జిరాక్ ప్రముఖ మానసిక వైద్యుడు. జిరాక్, ఐశ్వర్య కలిసి ముంబైలోని జై హింద్ కాలేజీ చదువుకున్నారు. జిరాక్ రాసిన ‘పేరెంటింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యాంగ్జయిటీని’ అనే పుస్తకాన్ని ఐశ్యర్య లాంచ్ చేసింది. జిరాక్, అతడి భార్య, పేరెంట్ కోచ్ ప్రియా మార్కస్ తో కలిసి ఐశ్వర్య ఫ్యామిలీ తరచుగా హాలీడే ట్రిప్ కు వెళ్తుంటారు. సోషల్ మీడియాలో జిరాక్, అభిషేక్ ఒకరినొకరు ఫాలో అవుతారు. ఐశ్వర్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. 


ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య చివరగా ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో నటించింది. అటు ఐశ్వర్య, అభిషేక్ 2007లో పెళ్లి చేసుకున్నారు. 2011లో ఆరాధ్య జన్మించింది.



Read Also: నాని 'సరిపోదా శనివారం' నుంచి సర్‌ప్రైజ్‌ - టీజర్‌ కానీ టీజర్‌ విడుదల, ఈ వీడియో ప్రత్యేకత ఎంటంటే